Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బీచ్ లో బాలయ్య బ్యూటీ అందాల షో

హీరోయిన్ గా ఆఫర్లు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఐటెం సాంగ్స్ ల్లో చేస్తూ ఎప్పుడూ బిజీగా ఉంటుంది.

By:  Tupaki Desk   |   1 Jan 2024 8:32 AM GMT
పిక్ టాక్ : బీచ్ లో బాలయ్య బ్యూటీ అందాల షో
X

రెయిన్‌ బో అనే సినిమాతో టాలీవుడ్‌ లో 2008 సంవత్సరంలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్. ఈ అమ్మడు తెలుగు లో నందమూరి బాలకృష్ణ తో బ్యాక్‌ టు బ్యాక్‌ లెజెండ్‌, డిక్టేటర్‌, రూలర్‌ చిత్రాల్లో నటించి బాలయ్య హీరోయిన్ గా టాలీవుడ్‌ లో పేరు దక్కించుకున్న విషయం తెల్సిందే.


హీరోయిన్ గా ఆఫర్లు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఐటెం సాంగ్స్ ల్లో చేస్తూ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అయినా కూడా ఈ అమ్మడి ఏమాత్రం తగ్గలేదు అనడంలో సందేహం లేదు. తాజాగా మరోసారి ఆ విషయం నిజమే అన్నట్లుగా సోనాల్ ఫోటో షూట్‌ ఉంది.


రెగ్యులర్ గా ఇన్‌ స్టా ద్వారా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉండే ముద్దుగుమ్మ సోనాల్‌ చౌహాన్ ఈసారి ఇలా తన బీచ్‌ అందాల ఫోటోలను షేర్‌ చేసింది. బీచ్‌ లో బికినీ ధరించి అందమైన స్టిల్స్ ఇచ్చిన సోనాల్‌ చౌహాన్ అందరి దృష్టిని ఆకర్షించింది అనడంలో సందేహం లేదు.

బాలీవుడ్‌ రేంజ్ అందం ఈమెది అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఈ అందంను టాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ సద్వినియోగం చేసుకోలేదు అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మరోసారి సోనాల్‌ చౌహాన్ తన అందమైన ఫోటోలతో నెట్టింట వైరల్‌ అవుతోంది.