Begin typing your search above and press return to search.

సోనాల్ హై బికినీ ట్రీట్.. హీటెక్కించే లుక్

ఇటీవల సోనాల్ హాలీడే ట్రిప్ కి వెళ్లింది. అప్పటి నుంచి, ఆమె మరింత ఫోటో ట్రీట్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   15 Sep 2023 6:25 AM GMT
సోనాల్ హై  బికినీ ట్రీట్.. హీటెక్కించే లుక్
X

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రతి అమ్మాయి స్టార్ హీరోయిన్ అయిపోవాలనే కలలు కంటూ ఉంటుంది. కానీ, ఆ స్టానం చేరుకోవాలంటే ఆకర్షించే అందం, ఆకట్టునేలా నటించే సామర్థ్యం ఉంటే సరిపోదు. కూసంత అదృష్టం కూడా ఉండాలి. హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ విషయానికి వస్తే, ఆమెకు ఆకర్షించే అందం ఉంది. నటన కూడా ఇరగ దీస్తుంది. ఎంత కావాలంటే, అంతగా అందాలు ఆరబోయగలదు. కానీ, పాపం స్టార్ హీరోయిన్ రేంజ్ మాత్రం అందుకోలేకపోయింది.


అయితే, సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు కుర్రాళ్ల మతులు పోయేలా ఫోటోలు దిగి, వాటిని షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల సోనాల్ హాలీడే ట్రిప్ కి వెళ్లింది. అప్పటి నుంచి, ఆమె మరింత ఫోటో ట్రీట్ చేస్తోంది. గత మూడు, నాలుగు రోజులుగా బికినీ లో కన్నుల విందు చేస్తోంది. రీసెంట్ గా ఫ్లోరల్ బికినీలో కనపడిన ఆమె, ఆతర్వాత బ్లాక్ కలర్ బికినీలో దర్శనమిచ్చింది.

ఇక, ఆ బికినీలో ఆమె అందాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక, సోనాల్ కెరీర్ విషయానికి వస్తే, టాలీవుడ్ లో చాలా సినిమాలు చేసింది. వాటిలో చాలా వరకు హిట్ అయ్యాయి. కానీ, సోనాల్ కే ఇంకా స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకోలేకపోయింది. తెలుగులో చాలా మంది హీరోలతో నటిచింది కానీ, బాలకృష్ణ చిత్రాల ద్వారానే సోనాల్ చౌహాన్‌కు మంచి గుర్తింపు వచ్చింది.

లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాలలో సోనాల్ ఆకట్టుకున్నారు. మోడలింగ్ తో కెరీర్ మొదలుపెట్టిన ఆమె హిందీ సినిమా జన్నత్‌తో సినిమాల్లోకి అడుగుపెట్టారు. 2008లో 'రైన్ బో' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్ మూవీలో ఓ చిన్న రోల్ లో కనిపించారు. సోనాల్ సినిమాల సంగతి ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం చాలా మంచి క్రేజ్ ఉంది.

సోనాల్ కి కేవలం ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 5 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక, సోనాల్ సోషల్ మీడియాలో ఫోటోలు చూస్తే, కుర్రాళ్లకు నిద్రపట్టదు అనే చెప్పాలి. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోజులతో మతి పోగొడుతూ ఉంటుంది. అప్పుడుప్పుడు బికినీ ట్రీట్ ఇస్తూ, తన ఫ్యాన్స్, ఫాలోవర్స్ ని ఖుషీ చేస్తూ ఉంటుంది.