షోకేస్‌లో బార్బీలా సోనాల్ సొగసు
అందమైన పసుపు రంగు ఫ్రాక్‌లో సోనాల్ అందచందాలు, మనోహరమైన రూపం కుర్రకారుకు మత్తెక్కిస్తున్నాయి.
By: Tupaki Desk | 20 Jun 2025 10:23 AM ISTసోనాల్ చౌహాన్ పరిచయం అవసరం లేదు. స్టార్ డమ్ కోసం సుదీర్ఘకాలం పోరాటం సాగించిన కథానాయికల్లో ఈ ముంబై బ్యూటీ పేరు లిస్ట్ లో ఉంది. కానీ స్టార్ డమ్ అనేది ఏ కొందరికో చిక్కే ఆయాచిత వరం. టాలీవుడ్ లో వరుసగా అగ్ర కథానాయకుడు బాలకృష్ణ సినిమాల్లో నటించినా ఆశించినది దక్కలేదు. అటు బాలీవుడ్ లోను కొన్ని యూత్ ఫుల్ లవ్ స్టోరీస్‌లో నటించింది. బంగ్లాదేశ్ స్టార్ హీరో సరసన కూడా సోనాల్ ఓ చిత్రంలో నటించింది. కానీ ఆ సినిమాకి సంబంధించిన తాజా అప్డేట్ రాలేదు.
ప్రస్తుతం సోనాల్ తన అభిమానులకు సోషల్ మీడియాల ద్వారా టచ్‌లో ఉంది. నిరంతరం వేడెక్కించే స్పెషల్ ఫోటోషూట్లతో సోనాల్ ఎక్స్ క్లూజివ్ ట్రీటిస్తోంది. అందమైన పసుపు రంగు ఫ్రాక్‌లో సోనాల్ అందచందాలు, మనోహరమైన రూపం కుర్రకారుకు మత్తెక్కిస్తున్నాయి. షోకేస్‌లో బార్బీలా సోనాల్ సొగసు మత్తెక్కిస్తోంది అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
''నేను కవర్ కోసం సరైన రూపాన్ని ఎంచుకున్నానా?'' అనే ట్యాగ్ లైన్ తో ఈ ఫోటోషూట్ ని షేర్ చేసింది సోనాల్. దీనిని బట్టి ఈ బ్యూటీ ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫోటోషూట్ చేసిందని అర్థమవుతోంది. 2022 లో ఎఫ్ 3- ఫన్ అండ్ ఫ్రస్టేషన్, ఘోస్ట్ సినిమాల్లో నటించింది.
ఆ తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ లో మండోదరి పాత్రలో కనిపించింది. ఇటీవల సోనాల్ కి తెలుగులో అవకాశాలు లేవు. ప్రస్తుతం సోనాల్ తెలుగులో అగ్ర దర్శకనిర్మాతలకు ఫీలర్స్ వదులుతోంది. మరాఠాలోను నటించేందుకు కథలు వింటోందని తెలిసింది. తదుపరి పెద్ద ప్రాజెక్ట్ గురించి ప్రకటన వెలువడాల్సి ఉంది.
