బీచ్‌లో బికినీ సైరన్ ఎవరో కనిపెట్టగలరా?
టోన్డ్, ఫిట్ బాడీతో గుబులు పుట్టించే ఈ భామ నేటి జెన్ జెడ్ హీరోయిన్లతో పోటీపడుతూ నిరంతరం ఫిట్నెస్ మంత్రం జపిస్తుంది.
By: Tupaki Desk | 19 May 2025 5:44 PM ISTటోన్డ్, ఫిట్ బాడీతో గుబులు పుట్టించే ఈ భామ నేటి జెన్ జెడ్ హీరోయిన్లతో పోటీపడుతూ నిరంతరం ఫిట్నెస్ మంత్రం జపిస్తుంది. సోషల్ మీడియాల్లో ఈ యంగ్ బ్యూటీ షేర్ చేసే బో* ఫోటోషూట్లు ఇంటర్నెట్ ని మరిగిస్తున్నాయి. ఇప్పుడు మరోసారి తనదైన శైలిలో చెలరేగిపోయింది. అలా బీచ్ ఇసుకలో ఆరాంగా, స్వేచ్ఛగా సేద దీరుతోంది. ఇసుకలో పొర్లుతూ తన ముఖాన్ని హ్యాట్ తో కవర్ చేసింది. ఇంతకీ ఎవరు ఈ భామ? తీగ లాంటి శరీరాకృతితో కుర్రకారు హృదయాలను మరిగించే ఈ బ్యూటీ సోనాల్ చౌహాన్. బాలయ్య బాబు సినిమాల్లో వరుసగా నటించిన ఈ భామ, అగ్ర హీరోల సరసన నటించేందుకు ప్రయత్నిస్తోంది.
ఇటీవలే 38 ఏళ్లు నిండిన సోనాల్ చౌహాన్ బీచ్ పార్టీలో ఫుల్ గా చిల్ చేసింది. అక్కడ ఎండలో ఇసుకలో ఆటలాడింది. బీచ్ వాటర్స్ లో జలకాలాడింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ గుబులు పెంచుతోంది. తాజాగా నీలం చారల చొక్కా ధరించి, ఎరుపు బికినీని కవర్ చేస్తూ, ఇసుకలో సేద దీరుతూ కనిపించింది. తన ముఖాన్ని హ్యాట్ కవర్ చేయడంతో ఎవరో గుర్తించడం కష్టంగా ఉంది. బర్త్ డే వేడుకలు ఇలా బీచ్ లో ప్లాన్ చేయడం బావుంది. కానీ కుర్రకారు కంటికి కునుకుపట్టనివ్వని రీతిలో టీజ్ చేయడం బాలేదు! అంటూ బోయ్స్ కామెంట్ చేస్తున్నారు.
సోనాల్ కి టాలీవుడ్ ఛాన్సులివ్వదు.. కోలీవుడ్ పిలవదు.. హిందీలోను జీరో అయిపోయింది. కానీ బంగ్లాదేశ్ సినీపరిశ్రమలో అవకాశాలు అందుకుంటోందని కథనాలొచ్చాయి. కానీ దానికి సంబంధించిన అప్ డేట్ ఇటీవల రాలేదు. నటనా కెరీర్ తో సంబంధం లేకుండా, సోషల్ మీడియాల్లో యాడ్ పోస్టింగులతో సోనాల్ ఆర్జిస్తోంది.
