Begin typing your search above and press return to search.

గ్లింప్స్: ఈ వేశ్య టూమ‌చ్ రెక్లెస్ గురూ

ఎవ‌రైనా న‌టి లేదా న‌టుడు ఎలాంటి పాత్ర‌ల్లో అయినా న‌టించేందుకు సిద్ధంగా ఉండాలి. దానికోసం శ‌రీర‌భాష‌లో ఫ్రీమూవ్‌మెంట్ ఫ్లెక్సిబిలిటీ చాలా కీల‌కం

By:  Tupaki Desk   |   7 April 2024 6:31 AM GMT
గ్లింప్స్: ఈ వేశ్య టూమ‌చ్ రెక్లెస్ గురూ
X

ఎవ‌రైనా న‌టి లేదా న‌టుడు ఎలాంటి పాత్ర‌ల్లో అయినా న‌టించేందుకు సిద్ధంగా ఉండాలి. దానికోసం శ‌రీర‌భాష‌లో ఫ్రీమూవ్‌మెంట్ ఫ్లెక్సిబిలిటీ చాలా కీల‌కం. ఇదిగో ఇక్క‌డ సోనాక్షి సిన్హా బాడీ లాంగ్వేజ్‌లో అలాంటి టింజ్ క‌నిపిస్తోంది. హీరామండి వేశ్యగా ఒదిగిపోయి న‌టించింద‌న‌డానికి ఈ చిన్న‌పాటి గ్లింప్స్ చాలు. క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ నెట్ ఫ్లిక్స్ ఒరిజిన‌ల్ సిరీస్ హీరామండిని ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్ లో మ‌నీషా కొయిలారా, రిచా చ‌ద్దా, సోనాక్షి స‌హా ప‌లువురు అంద‌మైన‌ భామ‌లు న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే భామ‌ల లుక్ కి సంబంధించిన పోస్ట‌ర్లు వీడియోలు రిలీజై సంచ‌ల‌నం సృష్టించాయి. తాజాగా గ్లోబల్ సిరీస్ 'హీరామండి' నుండి తదుపరి ట్రాక్ 'తిలాస్మి బహెన్'ను విడుద‌ల చేయ‌గా దీనికి అద్బుత స్పంద‌న వ‌స్తోంది. ముఖ్యంగా ఈ పాట‌లో సోనాక్షి విల‌క్ష‌ణ‌మైన‌ లుక్, అభిన‌యంతో మ‌తులు చెడ‌గొడుతోంది. మునుపెన్నడూ చూడని కొత్త‌ అవతార్‌లో సోనాక్షి సిన్హాను ఆవిష్క‌రించారు భ‌న్సాలీ.

ఈ పాట‌లో వేశ్య బాడీ లాంగ్వేజ్ ని ఫ్లెక్సిబిలిటీని సోనాక్షి ప్ర‌ద‌ర్శించిన తీరు మ‌తులు చెడ‌గొడుతోంది. హీరామండీలో బ‌డా బాబుల సాంగత్యంలో నృత్యాల‌తో అద‌ర‌గొడుతున్న సోనాక్షి అద్భుత అభిన‌యంతో క‌ట్టి ప‌డేస్తోంది. హీరామండిలో సోనాక్షి 'ఫరీదాన్' అనే పాత్రలో న‌టిస్తోంది. ఇక ఈ పాట‌లో వేశ్య‌గా సోనాక్షి ఎక్స్ ప్రెష‌న్ లో నిర్లక్ష్య వైఖ‌రి, విటుల‌తో ప్ర‌వ‌ర్తించే తీరు కూడా ఎంతో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు సోనాక్షి బెస్ట్ పెర్ఫామెన్స్ ఇది అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు.

తిలస్మి బహెన్ లో సోనాక్షి సిన్హా ఇంతకుముందు కనిపించని విధంగా విలాసవంతమైన వేష‌ధార‌ణ‌, అందంతో ఆక‌ర్షిస్తోంది. న‌టిగా సోనాక్షి కళాత్మక ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి పాత్ర ఇదని అర్థ‌మ‌వుతోంది. సంజయ్ లీలా భ‌న్సాలీ దర్శకత్వం చాలా మంది కళాకారుల కెరీర్ ని ఎలా మలుపు తిప్పిందో చూశాం. హీరామండి నుంచి ఈ ట్రాక్ కూడా సోనాక్షి కెరీర్ ని మ‌లుపు తిప్పుతుంద‌ని భావిస్తున్నారు. ఇందులో సోనాక్షిలో విల‌క్ష‌ణ‌త‌ను బ‌హిర్గ‌తం చేస్తోంది.

'తిలస్మి బహెన్' పాటలో మెరిసే చీరలో సోనాక్షి మెరుపులు మెరిపించింది. ఈ లుక్ కి సంబంధించి ముంబైలోని ఓ థియేట‌ర్ వ‌ద్ద సోనాక్షి క‌టౌట్ కూడా అంతే మెరుపులు మెరిపిస్తోందని స‌మాచారం. తాజాగా ముంబైలోని పురాతన థియేటర్ హాల్‌లలో ఒకటైన గైటీ-గెలాక్సీలో ప్ర‌మోష‌న్ స‌మ‌యంలో సోనాక్షిని చూసేందుకు అభిమానులు వందల సంఖ్యలో గుమిగూడారు. ఈ థియేట‌ర్ ముందు సోనాక్షి లార్జ‌ర్ దేన్ లైఫ్ క‌టౌట్‌తో అలంకరించారంటే ఫ్యాన్స్ లో సోనాక్షి క్రేజ్ ని అర్థం చేసుకోవ‌చ్చు. హీరామండి రాక కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా వేచి చూస్తుండ‌గా, తిలాస్మి బహెన్ ప్రేక్ష‌కుల్లో మ‌రింత ఊపు పెంచింది. సంజయ్ లీలా భ‌న్సాలీ దర్శకత్వం వహించిన 'హీరమండి' హద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా హృదయాలను దోచుకునే సినిమాటిక్ మాస్టర్‌పీస్‌గా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు.