Begin typing your search above and press return to search.

అందరు హీరోయిన్స్ కి అదే సమస్య..!

ఆ వెబ్‌ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా సోనాక్షి సిన్హా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ మీడియా లో సందడి చేస్తుంది.

By:  Tupaki Desk   |   15 May 2024 2:30 PM GMT
అందరు హీరోయిన్స్ కి అదే సమస్య..!
X

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా తాజాగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన 'హీరామండి' వెబ్‌ సిరీస్‌ లో నటించిన విషయం తెల్సిందే. ఆ వెబ్‌ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా సోనాక్షి సిన్హా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ మీడియా లో సందడి చేస్తుంది.

ఇటీవల తాను ఇప్పటి వరకు బోల్డ్‌ సన్నివేశాలు చేయలేదని, ఒకవేళ బోల్డ్‌ సన్నివేశాలు చేయాల్సి వస్తే ఆ సినిమాను నేను వదిలేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. నేను ముందుగానే మేకర్స్ తో బోల్డ్‌ సన్నివేశాలు చేయను అంటూ చెప్తాను అంది. తాజాగా హీరోయిన్స్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి సోనాక్షి సిన్హా కామెంట్స్ చేసింది.

హీరోయిన్స్‌ ఖచ్చితంగా చాలా సినిమాల్లో హీరోల స్థాయిలో కష్టపడుతున్నారు. కానీ వారు అందుకునే పారితోషికం మాత్రం నామమాత్రమే. నేను పారితోషికం విషయంలో స్ట్రిక్ట్‌ గానే ఉంటాను. నేను ముందుగానే కథ విని, షూటింగ్‌ డేట్స్ ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని పారితోషికం చెప్తాను.

పారితోషికం నేను చెప్పిన సమయంలో చాలా మంది నిర్మాతలు తగ్గించుకోవాల్సిందిగా కోరుతూ ఉంటారు. అయితే ఆ నిర్మాతలు హీరోలను పారితోషికం తగ్గించుకోమని అడిగింది నేను ఎప్పుడు చూడలేదు. వారు పారితోషికం విషయంలో హీరోయిన్స్ వద్ద మాత్రమే బేరాలు ఆడటం చూస్తాం అంది.

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా హీరోయిన్స్‌ పారితోషికం విషయంలో పూర్తి స్వేచ్చగా ఉండలేక పోతున్నారు. వారు కోరుకున్న మొత్తం ను తీసుకోలేక పోతున్నారు. హీరోయిన్స్‌ అంతా ఒక్క తాటిపైకి ఈ విషయంలో వచ్చినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని సోనాక్షి సిన్హా చెప్పుకొచ్చింది.

హీరామండి వెబ్‌ సిరీస్ లో సోనాక్షి సిన్హా పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సంజయ్ లీలా భన్సాలి సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ వెబ్‌ సిరీస్ ఉంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సిరీస్ ఉండటంతో సోనాక్షి సిన్హా మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వడం ఖాయం అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.