గర్భధారణ పుకార్లపై సోనాక్షి స్పందన
బాలీవుడ్ ప్రముఖ కథానాయిక సోనాక్షి సిన్హా మతాంతర వివాహం ఇటీవలి కాలంలో చాలా చర్చగా మారింది.
By: Tupaki Desk | 6 July 2025 11:00 PM ISTబాలీవుడ్ ప్రముఖ కథానాయిక సోనాక్షి సిన్హా మతాంతర వివాహం ఇటీవలి కాలంలో చాలా చర్చగా మారింది. సహనటుడు జహీర్ ఇక్భాల్‌ని ప్రేమ వివాహం చేసుకుంది సోనాక్షి. అయితే సోనాక్షి- జహీర్ జంట కోర్ట్ వివాహం చేసుకోగా, ఈ పెళ్లికి సోనాక్షి తండ్రి శత్రుఘ్నసిన్హా విచ్చేసారు కానీ, ఇతర కుటుంబ సభ్యులు రాలేదని ప్రచారం సాగింది.
ఈ జంట వివాహం జరిగి మొదటి వార్షికోత్సవం కూడా పూర్తయింది. ఈ సమయంలో జహీర్ తో సోనాక్షి అన్యోన్య దాంపత్యం, సరదాలు, సరసాల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఏడాది తర్వాత సోనాక్షి సోదరుడు ఖుష్ సిన్హాకు కూడా అక్కపై కోపం తగ్గింది. అతడు కూడా అక్కా బావలతో సరదాగా కలిసిపోయాడని కథనాలొచ్చాయి. తాజాగా జహీర్ కి, సోనాక్షికి మధ్య వాట్సాప్ చాట్ లో చాలా సరసం బయటపడింది.
జహీర్ ఇక్బాల్‌తో సోనాక్షి సిన్హా వాట్సాప్ చాట్‌ను సోనాక్షి స్వయంగా ఆన్ లైన్ లో లీక్ చేసింది... ఈ చాట్‌లో ఇలా ఉంది.
జహీర్: ఆకలిగా ఉందా?
సోనాక్షి: అస్సలు కాదు, నాకు ఆహారం ఇవ్వడం ఆపండి
జహీర్: సెలవు ప్రారంభమైందని నేను అనుకున్నాను
సోనాక్షి: నేను ముందు రోజు రాత్రి భోజనం తిన్నాను, ఆపు..!
ఈ సరస సంభాషణతో పాటు, ముద్దు ఎమోజీలు వాట్సాప్ లో కనిపించాయి. లవ్ యు.. లవ్ యు మోర్ అంటూ వారి ప్రేమ సందేశాలతో చాట్ ఆకర్షించింది. ఈ మొత్తం చాట్ తాలూకా స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ సోనాక్షి ఇలా రాసింది, ``నేను గర్భవతిని (గర్భవతి) అని అందరూ అనుకోవడానికి కారణం ఏమిటి? ఇక ఆపండి! అని రాసింది సోనాక్షి. జహీర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్క్రీన్‌షాట్‌ను తిరిగి షేర్ చేసి, కొన్ని నవ్వించే ఎమోజీలను జోడించారు. 2024లో జహీర్ ని పెళ్లాడాక సోనాక్షికి ప్రతిసారీ ఇదే ప్రశ్న ఎదురవుతోంది. మొదటి బిడ్డ జననం గురించి అభిమానులంతా ఆరాలు తీస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... సోనాక్షి తదుపరి నికితా రాయ్ `ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్` చిత్రంలో నటిస్తుంది. ఇది 18 జూలై 2025న థియేటర్లలో విడుదల కానుంది. అర్జున్ రాంపాల్, పరేష్ రావల్, సుహైల్ నయ్యర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సోనాక్షి సోదరుడు కుష్ సిన్హా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మరోవైపు జహీర్ ఇంకా తన తదుపరి సినిమాని ప్రకటించాల్సి ఉంది.
