జహీర్ ఇక్బాల్‌తో సోనాక్షి పరిచయం ఎలా?
అయితే జహీర్ ఇక్బాల్‌తో పరిచయం ఎలా? ప్రేమాయణం ఎలా మొదలైంది? అన్న ప్రశ్నకు ఇప్పుడు సోనాక్షి సమాధానం ఇచ్చింది.
By: Tupaki Desk | 24 Jun 2025 10:56 PM ISTఇంట్లో చాలా అలకలు, కలతలు అన్నిటినీ జయించి చివరికి తాను వలచిన సఖుడిని పెళ్లాడింది సోనాక్షి సిన్హా. ఒక ముస్లిమ్ యువకుడైన జహీర్ ఇక్బాల్ తో హిందువు అయిన సోనాక్షి ప్రేమపెళ్లికి ఇంట్లో అంగీకారం లభించలేదని కథనాలొచ్చాయి. కానీ చివరికి కుమార్తె సోనాక్షి సిన్హా పెళ్లికి వచ్చి అక్షింతలు వేసారు షాట్ గన్ శత్రుఘ్న సిన్హా. కూతురు సంతోషంగా ఉండాలని అతడు కోరుకున్నాడు. అయితే సోనాక్షి సిన్హా సోదరుడు ఖుష్, తల్లి మాత్రం తన పెళ్లి విషయంలో చాలా కోపంగా ఉన్నారని కథనాలొచ్చాయి. కానీ మొదటి వివాహ వార్షికోత్సవం (సోమవారం నాటికి) లోపే ఇప్పుడు వారంతా చల్లబడ్డారు. సోనాక్షి ప్రేమ వివాహానికి ఇక ట్రబుల్స్ ఏవీ లేవని మీడియాలో కథనాలొస్తున్నాయి. ప్రేమ వివాహంలో ఇవన్నీ మామూలే అయినా, సోనాక్షి డేర్, గట్స్ గురించి ఇక్కడ అందరూ మెచ్చుకుంటున్నారు.
అయితే జహీర్ ఇక్బాల్‌తో పరిచయం ఎలా? ప్రేమాయణం ఎలా మొదలైంది? అన్న ప్రశ్నకు ఇప్పుడు సోనాక్షి సమాధానం ఇచ్చింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన పార్టీలో జహీర్‌ను తాను మొదటిసారి కలిశానని సోనాక్షి తెలిపారు. అతడు అధికారిక మ్యాచ్ మేకర్ కాకపోయినా, ఆమె అతడి ప్రేమ కథలో `సూత్రధార్` అని పేర్కొంది. అతడు మా పెళ్లి గురించి చాలా సంతోషంగా ఉన్నాడని సోనాక్షి తెలిపింది. అతడు మా ఇద్దరినీ చాలా ఇష్టపడతాడు. మేము కలుసుకున్నది అతడి(సల్మాన్) వల్లనే! అని సోనాక్షి అన్నారు. తొలి పరిచయంలోనే ఇద్దరూ ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యారు. సోనాక్షి ఒక వారంలోనే తన భావాలను ఒప్పుకుంది. ఈ జంట దాదాపు ఎనిమిది సంవత్సరాలు తమ సంబంధాన్ని గోప్యంగా ఉంచారు. గత సంవత్సరం జూన్ 23న వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం రిసెప్షన్ కి బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్ ఖాన్, రేఖ, కాజోల్, టబు, అనిల్ కపూర్, సంజయ్ లీలా భన్సాలీ, రిచా చద్దా, అదితి రావు హైదరి, రవీనా టాండన్, హనీ సింగ్ తదితరులు హాజరయ్యారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సోనాక్షి తన సోదరుడు కుష్ ఎస్ సిన్హా దర్శకత్వం వహించిన నికితా రాయ్ అనే హారర్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది. గుల్షన్ దేవయ్యతో కలిసి దహాద్ సీజన్ 2లోను సోనాక్షి నటిస్తోంది. జోయా అక్తర్ - రీమా కాగ్టి దీనిని రూపొందిస్తున్నారు.
