జటాధరపై అప్డేట్ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ను తాజాగా రివీల్ చేసింది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి.
By: Tupaki Desk | 9 April 2025 7:30 PMసూపర్ స్టార్ కృష్ణకు అల్లుడిగా, మహేష్ బాబుకు బావగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. గతేడాది మా నాన్న సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సుధీర్, ఆ సినిమాతో యావరేజ్ ఫలితాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం సుధీర్ చేతిలో రెండు సినిమాలున్నాయి.
వాటిలో ఒకటి జటాధర కాగా, రెండోది మాయదారి మల్లిగాడు. ఈ రెండింటిలో జటాధర సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు ఆడియన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్లే ఇలా ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనే ఆసక్తిని కలిగించడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయింది.
భారీ అంచనాలతో రిలీజవుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ముఖ్యపాత్రలో నటిస్తోంది. ఈ సినిమా సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జటాధర కథ అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చుట్టూ ఉన్న వివాదాలు, ఆ గుడి చరిత్ర లాంటివి జటాధరలో చూపించనున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ను తాజాగా రివీల్ చేసింది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి. జటాధరలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తైందని, ఈ మూవీ షూటింగ్ ను తాను పూర్తి చేసినట్టు తన ఇన్‌స్టా ద్వారా సోనాక్షి తెలిపింది. జటాధరలో తన క్యారెక్టర్ చాలా గొప్పగా ఉండనుందని, తన ఫస్ట్ తెలుగు సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడంతో తనకెంతో సంతోషంగా ఉందని సోనాక్షి పేర్కొంది.
సోనాక్షి మాటల్ని బట్టి చూస్తుంటే ఈ సినిమాలో తన పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది. ఉమెన్స్ డే సందర్భంగా సోనాక్షి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఆ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జటాధరలో కేవలం అనంత పద్మనాభ స్వామి నాధి గురించి మాత్రమే కాకుండా ఆ గుడి చరిత్రను, అక్కడి పురాణ కథల్ని కూడా చూపించబోతున్నట్టు సమాచారం. ఈ మూవీని ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై శివివన్ నారంగ్, నిఖిల్ నంద్, ఉజ్వల్ ఆనంద్ నిర్మిస్తున్నారు.