భర్తతో హీరోయిన్ వాట్సప్ చాట్ ఇలా..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా గత ఏడాది జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సోనాక్షి సిన్హా గర్భవతి అంటూ ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 5 July 2025 3:12 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా గత ఏడాది జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సోనాక్షి సిన్హా గర్భవతి అంటూ ప్రచారం జరుగుతోంది. ఇటీవల సోనాక్షి కాస్త బరువు పెరిగింది. దాంతో సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలోనే కాకుండా రెగ్యులర్ మీడియాలోనూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో పలు సార్లు సోనాక్షి సిన్హా తాను గర్భవతిని కాదు అంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రెగ్నెంట్ అంటూ పుకార్లు రావడానికి ప్రధాన కారణం బరువు పెరగడం అనే విషయాన్ని సోనాక్షి గుర్తించినట్లు ఉంది. అందుకే తాజాగా సోషల్ మీడియాలో సరదాగా ఒక పోస్ట్‌ను షేర్ చేసింది.
తన భర్త జహీర్ ఇక్బాల్‌తో చేసిన వాట్సప్ చాట్‌ను సోనాక్షి సిన్హా షేర్ చేసింది. తనను జనాలు ప్రెగ్నెంట్ అనుకోవడానికి ఇదే కారణం అంటూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. వాట్సప్‌లో భర్తతో చేసిన చాట్‌ను స్క్రీన్ షాట్ తీసి మరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. పదే పదే తిన్నావా.. తింటావా అంటూ జహీర్ అడగడం వల్ల, పెళ్లి అయినప్పటి నుంచి ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగినట్లు సోనాక్షి చెప్పకనే చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం సోనాక్షి సిన్హా షేర్ చేసిన ఈ వాట్సప్ స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. దీంతో అయినా సోనాక్షి సిన్హా గర్భవతి అంటూ వస్తున్న వార్తలకు, పుకార్లకు బ్రేక్ పడుతుందా అని అనేది చూడాలి.
వాట్సప్ చాట్‌లో.. ఆకలిగా ఉందా అని సోనాక్షిని జహీర్ అడిగాడు, అప్పుడు నాకు తినిపించడం మానేయండి అంటూ సోనాక్షి సమాధానం ఇచ్చింది. జహీర్ అప్పుడు హాలిడేస్ స్టార్ అయ్యాయని అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు వెంటనే సోనాక్షి మీ ముందు డిన్నర్ చేశాను కదా అంటూ సమాధానం ఇచ్చింది. ఇద్దరూ ఒకరికి ఒకరు ఐ లవ్ యూ అంటూ చెప్పుకున్నారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం బాగుంటుందని బాలీవుడ్‌లో చాలా మంది అంటూ ఉంటారు. తాజాగా వీరిద్దరు చేసుకున్న ఈ వాట్సప్ చాట్ ని చూస్తూ ఉంటే వీరిద్దరు బాలీవుడ్‌లోనే మోస్ట్ బ్యూటీఫుల్ అండ్ రొమాంటిక్ జోడీగా నిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
2010లో సల్మాన్ ఖాన్ మూవీ దబాంగ్‌తో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన సోనాక్షి సిన్హా ఆకట్టుకుంది. హిందీలో మొదటి సినిమాతోనే హిట్ కొట్టడంతో పాటు వరుస ఆఫర్లు సొంతం చేసుకుంది. 2012లో ఏకంగా ఐదు సినిమాలతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత అంతకు మించిన సినిమాలతో సోనాక్షి సిన్హా సినిమాలు విడుదల అయ్యాయి. కెరీర్ ఆరంభంలో సక్సెస్ రేటు ఎక్కువ ఉండటంతో పాటు, స్టార్ హీరోల సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలిచింది. అందుకే సోనాక్షి సిన్హా బాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. గత ఏడాది రెండు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌తోనూ వచ్చిన ఈ అమ్మడు ఇప్పటికే ఈ ఏడాదిలో ఒక సినిమాతో వచ్చింది. ప్రస్తుతం గర్భవతి కావడంతో సినిమాలకు దూరంగా ఉంది. త్వరలోనే ఈమె నటిగా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
