Begin typing your search above and press return to search.

ఈ - కామర్స్ వెబ్ సైట్ లపై సోనాక్షి సిన్హా మండిపాటు.. నైతిక విలువ లేదంటూ!

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

By:  Madhu Reddy   |   3 Sept 2025 1:48 PM IST
ఈ - కామర్స్ వెబ్ సైట్ లపై సోనాక్షి సిన్హా మండిపాటు.. నైతిక విలువ లేదంటూ!
X

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ఈ - కామర్స్ వెబ్ సైట్ లపై ఆమె మండిపడుతూ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. కొన్ని ఈ-కామర్స్ వెబ్ సైట్ లు తన అనుమతి లేకుండా తన ఫోటోలు వాడుకున్నారని ఆమె మండిపడింది. ఈ మేరకు ఒక పోస్ట్ కూడా పంచుకుంది.


ఈ - కామర్స్ వెబ్ సైట్ లపై సోనాక్షి మండిపాటు..

సోనాక్షి తన పోస్టులో ఏం షేర్ చేసింది అనే విషయానికి వస్తే.. "ఎక్కువగా నేను ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాను. కానీ ఈ మధ్య కొన్ని బ్రాండెడ్ వెబ్సైట్ లలో నా ఫోటోలు పెట్టారు. అవి చూసి నేను షాక్ అయ్యాను. నా అనుమతి లేకుండా, నన్ను సంప్రదించకుండా నా ఫోటోలు ఎలా ఉపయోగించుకుంటారు? దీనిని నేను సహించలేక పోతున్నాను. ఒక నటిగా నేను కొత్త కొత్త దుస్తులు, ఆభరణాలు ధరిస్తూ ఉంటాను. ఆ డ్రస్ వివరాలు కూడా దాని బ్రాండ్ కు క్రెడిట్ ఇస్తూ పోస్ట్ కూడా చేస్తాను.. నేను ఆ పోస్ట్ లో చెప్పినంత మాత్రాన నా ఫోటోలు మీ వెబ్సైట్ కి ఎలా ఉపయోగించుకుంటారు? నైతిక బాధ్యత వహించరా? అసలు ఇలా చేయడం సరైన పద్ధతి కాదు అని మీకు తెలియదా ?

పాటించకపోతే లీగల్ నోటీసులు..

ముందే అందరికీ ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాను. దయచేసి నా ఫోటోలు వెంటనే తొలగించండి. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ రాసుకుంది సోనాక్షి సిన్హా. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా కొన్ని ఈ - కామర్స్ వెబ్ సైట్ లు తన అనుమతి లేకుండా తాను ధరించే దుస్తులు, జువెలరీని ప్రమోట్ చేసుకుంటూ తన ఫోటోని వాడటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి దీనిపై ఆ ఈ - కామర్స్ సంస్థలు వెంటనే స్పందిస్తాయా? లేక ఈమె ఇచ్చే లీగల్ నోటీసులు అందుకుంటాయా? అన్నది తెలియాల్సి ఉంది.

సోనాక్షి సిన్హా సినిమాలు..

సోనాక్షి సిన్హా సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే 'హీరమండీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే అర్జున్ రాంపాల్ , పరేష్ రావల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ వచ్చిన ' నికిత రాయ్' అనే చిత్రంలో కూడా నటించింది. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని ఖుష్ ఎన్ సిన్హా తెరకెక్కించారు.

జటాధర మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న సోనాక్షి సిన్హా..

అలాగే సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న 'జటాధర' అనే సినిమాలో కూడా ఈమె కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో ప్రముఖ సూపర్ స్టార్ మహేష్ బాబు వదిన శిల్పా శిరోద్కర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. పౌరాణిక, మిస్టరీ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జి స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కబోతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.