Begin typing your search above and press return to search.

సోనాక్షి రేసులో ఇలా వెనుక‌బ‌డితే ఎలా?

బాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు శ‌త్రుజ్ఞు సిన్హా వార‌సురాలిగా సోనాక్షి సిన్హా తెరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Jun 2025 6:30 PM
సోనాక్షి రేసులో ఇలా వెనుక‌బ‌డితే ఎలా?
X

బాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు శ‌త్రుజ్ఞు సిన్హా వార‌సురాలిగా సోనాక్షి సిన్హా తెరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. `ద‌బాంగ్` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు హీరోయిన్గా చాలా సినిమాలు చేసింది. స్పెష‌ల్ అప్పిరియ‌న్స్ ల‌తోనూ అల‌రించింది. సోనాక్షి ఇప్ప‌టికే 15 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకుంది. మ‌రి బాలీవుడ్ హీరోయిన్ల‌లో సోనాక్షి స్థానం ఎన్న‌వ‌ది? అంటే చెప్ప‌డం క‌ష్టం. అమ్మ‌డు మంచి పెర్పార్మ‌ర్.

కొన్ని యూనిక్ క్వాలిటీస్ ఉన్నాయి. కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఫేమ‌స్ కాలేక‌పోయింది. దీపికా ప‌దు కొణే, క‌రీనా క‌పూర్ , అలియాభ‌ట్ లా ఇండ‌స్ట్రీలో రాణించ‌లేక‌పోతుంది? అన్న‌ది వాస్త‌వం. 15 ఏళ్ల కెరీర్ అంటే సోనాక్షి ఇప్ప‌టికే స్టార్ లీగ్ లో చేరిపోయావాలి. హీరోయిన్ గా ఓ బ్రాండ్ లా వెలిగిపోవాలి. భారీగా పారితోషిక అందుకోవాలి. బ్రాండ్ అంబాసిడ‌ర్ గా పుల్ బిజీగా ఉండాలి.

ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలి. కానీ సోనాక్షి వీటిన్నింటికి దూరంగానే ఉంది. వ‌చ్చిన అవ‌కాశాలు చేసుకుంటూ వెళ్ల‌డం త‌ప్ప‌! త‌న బ్రాండ్ మాత్రం వేయ‌లేకపోయింది. తండ్రికి త‌గ్గ త‌న‌యగా బాలీవుడ్ లో ఎద‌గ‌లేక‌పోయింది. స్టార్ హీరోలతో ప‌నిచేసింది కూడా చాలా త‌క్కువ సినిమాల్లోనే. ఈ మ‌ధ్య‌నే ఓ తెలుగు సినిమాలో కూడా న‌టిస్తోంది. సోనాక్షి రేంజ్ మూవీ కాద‌ది. కానీ వ‌చ్చిన అవ‌కాశాన్ని కాద‌న‌కుండా స‌ద్వినియోగం చేసుకుంటుంది.

ఈ విష‌యంలో సోనాక్షిని మెచ్చుకోవాలి. అమ్మ‌డు ఎంతో డౌన్ టౌ ఎర్త్. తండ్రి పెద్ద స్టార్ అయినా? తాను మాత్రం ఎంతో సింపుల్ లైప్ ని లీడ్ చేస్తుంది. సోనాక్షి పెళ్లి చేసుకుంది కూడా ఓ సినిమా రైట‌ర్ ని. అయితే కెరీర్ ప‌రంగా మాత్రం సోనాక్షి చేరాల్సిన గ‌మ్యం ఇంకా చేర‌లేదు. మ‌రి న‌వ నాయిక‌ల మ‌ధ్య పోటీని త‌ట్టుకుని ఆ రేంజ్ కు చేరుతుందా? లేదా? అన్న‌ది చూడాలి.