అజయ్ దేవగన్ మూవీ.. మళ్లీ అదే పరిస్థితి..
సినిమాలో మృణాల్ ఠాకూర్.. పాకిస్థానీ రోల్ ను పోషించడం బాలేదని, ముఖ్యంగా ప్రస్తుతం దాయాదితో వైరం ఉన్న వేళ అసలు కరెక్ట్ కాదని అంటున్నారు.
By: Tupaki Desk | 23 July 2025 1:00 AM ISTబాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఇప్పుడు సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ యాక్టర్ సునీల్ నటించిన మర్యాద రామన్నకు రీమేక్ గా బాలీవుడ్ లో కొన్నేళ్ల క్రితం సన్ ఆఫ్ సర్దార్ మూవీ తెరకెక్కింది.
అప్పట్లో ఆ సినిమా బీటౌన్ లో మంచి విజయం సాధించగా.. దానికి సీక్వెల్ గా ఇప్పుడు సన్ ఆఫ్ సర్దార్ 2 రిలీజ్ కు రెడీ అవుతోంది. అజయ్ దేవగన్ తో పాటు క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుంది.
తొలుత జులై 25వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇప్పుడు ఒక వారం ఆలస్యంగా ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే మేకర్స్.. ప్రమోషన్స్ లో భాగంగా పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ ను విడుదల చేశారు.
ఇప్పుడు సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేయాలని ఆలోచనలో రెండో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు కూడా సినీ ప్రియులను మెప్పించలేకపోయారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. నిజానికి మేకర్స్ కొంత కాలం క్రితం ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. అనుకున్నట్లు లేదని నెటిజన్లు కామెంట్లు పెట్టారు.
జెన్యూన్ కామెడీ లేదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు రెండో ట్రైలర్ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తుందని అంటున్నారు. భయంకరమైన జోకులు ఉన్నాయని, అభ్యంతరకరమైన వన్- లైనర్ లతో నిండి ఉందని చెబుతున్నారు. ఫస్ట్ ట్రైలర్ లోని విజువల్సే మళ్లీ చూపించారని, లేజీ ఎడిటింగ్ అంటూ విమర్శిస్తున్నారు.
సినిమాలో మృణాల్ ఠాకూర్.. పాకిస్థానీ రోల్ ను పోషించడం బాలేదని, ముఖ్యంగా ప్రస్తుతం దాయాదితో వైరం ఉన్న వేళ అసలు కరెక్ట్ కాదని అంటున్నారు. సినిమాలో ఒక ట్రాన్స్ క్యారెక్టర్ ను చేర్చడం ఓకే అయినా.. సదరు పాత్రతో అభ్యంతరకరమైన జోకులు వేసినప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుందని చెబుతున్నారు. ట్రైలర్ ఫన్నీగా లేదని.. చెబుతున్నారు. మరి సినిమా రిజల్ట్ ఏమవుతుందో చూడాలి.
