ఎట్టకేలకు ఆ సినిమాపై హోప్స్..!
సన్నాఫ్ సర్దార్ 2 సినిమాపై అంచనాలు పెరిగే విధంగా పో పో.. పాట ఉంది. సరదాగా సాగే ఈ మూడు నిమిషాల పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
By: Tupaki Desk | 18 July 2025 12:01 PM ISTరాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మర్యాద రామన్న' సినిమాను హిందీలో సన్నాఫ్ సర్దార్ టైటిల్‌తో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. అజయ్ దేవగన్ హీరోగా రూపొందిన ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ అంటూ సన్నాఫ్ సర్దార్ 2 వచ్చేందుకు రెడీ అయింది. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సన్నాఫ్ సర్దార్ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు రెండు మూడు వారాలుగా జరుగుతున్నప్పటికీ మినిమం బజ్ క్రియేట్ చేయలేక పోయారు. ఇప్పటి వరకు వచ్చిన పాటలు, టీజర్, ట్రైలర్ ఏ ఒక్కటి కూడా ఆహా సినిమాలో మ్యాటర్ ఉంటుందేమో.. చూద్దాం అనిపించలేదు.
ఎట్టకేలకు సినిమా వార్తల్లో నిలిచింది. ఇన్ని రోజులు సన్నాఫ్ సర్దార్ 2 సినిమా రాబోతుంది, ఈ సినిమాకు మినిమం బజ్ లేదు, ఈ సినిమాతో అజయ్ దేవగన్ మరో ఫ్లాప్‌ను మూట కట్టుకోబోతున్నాడా.. మృణాల్‌కు ఈ సినిమా అయినా హిందీలో హిట్ తెచ్చేనా అన్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేసే కథనాలు, వార్తలు మాత్రం రాలేదు. ఎట్టకేలకు ఈ సినిమా నుంచి వచ్చిన పో పో... సాంగ్ వల్ల ఈ సినిమా గురించి ఇండస్ట్రీలోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ చర్చ జరుగుతోంది. సినిమాలోని కాస్టింగ్‌తో పాటు, కాన్సెప్ట్ ను కూడా తెలుసుకునేందుకు ఈ పాటను చూసిన ప్రేక్షకులు ఆసక్తి కనబర్చుతూ వస్తున్నారు.
సన్నాఫ్ సర్దార్ 2 సినిమాపై అంచనాలు పెరిగే విధంగా పో పో.. పాట ఉంది. సరదాగా సాగే ఈ మూడు నిమిషాల పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎక్కువ సమయం లేకుండా సింపుల్ అండ్ స్వీట్‌గా, ఉన్నంతలో బాగుంది అన్నట్లుగా అనిపించింది. డాన్స్‌తో పాటు, ఫన్నీ మూవ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే పాటలో ఉన్నాయి. ఈ పాట ముందు ముందు చాలా పార్టీల్లో, కార్యక్రమాల్లో వినిపించబోతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో మ్యాటర్ ఉంటుందేమో అనిపించే విధంగా ఈ పాట ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సినిమాకు ఇప్పటికి అయినా ఒకింత బజ్ క్రియేట్ అయిందంటే ఈ పాట వల్లే అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
అజయ్ దేవగన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాకు విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించాడు. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. అజయ్ దేవగన్ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమా విషయంలో కొన్ని అనుమానాలు, కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పటికీ సినిమా గురించి కొందరు నెగటివ్‌గానే మాట్లాడుతూ ఉన్నారు. కానీ పో పో.. పాట వచ్చిన తర్వాత కాస్త పాజిటివ్ టాక్ మొదలైంది. కనుక సన్నాఫ్ సర్దార్ 2 సినిమాకు మినిమం ఓపెనింగ్స్ నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కామెడీ సీన్స్ నచ్చి, సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే తప్పకుండా వంద కోట్లను మించి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
