Begin typing your search above and press return to search.

బర్త్‌ డే కి 'OG' సాలిడ్ గిఫ్ట్‌

పుట్టిన రోజు సందర్భంగా పవన్‌ కళ్యాణ్ లుక్ మాత్రమే కాకుండా ఏకంగా ఓజీ టీజర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   29 Aug 2023 12:08 PM GMT
బర్త్‌ డే కి OG సాలిడ్ గిఫ్ట్‌
X

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో OG ఒకటి. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ను దానయ్య నిర్మిస్తున్నారు. ఆ మధ్య వరుస షెడ్యూల్ లో షూటింగ్ చేశారు. పుణె తో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ చేయడం జరిగింది. హరి హర వీరమల్లు సినిమా కంటే ముందు ఈ సినిమా రాబోతుందని ఇప్పటికే క్లారిటీ ఇవ్వడం జరిగింది.

ఈ ఏడాది చివర్లోనే పవన్‌ కళ్యాణ్ ఓజీ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నారు. ఇంకా షూటింగ్‌ బ్యాలన్స్ ఉంది. కనుక విడుదల ఈ ఏడాది ఉంటుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఓజీ సినిమా నుండి ఇప్పటి వరకు సాలిడ్ అప్డేట్‌ రాలేదు. ఫస్ట్‌ లుక్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.

సెప్టెంబర్‌ 2వ తారీకున పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు ఉన్న విషయం తెల్సిందే. పుట్టిన రోజు సందర్భంగా పవన్‌ కళ్యాణ్ లుక్ మాత్రమే కాకుండా ఏకంగా ఓజీ టీజర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే టీజర్ కట్టింగ్‌ పూర్తి అయిందని.. పవన్ కళ్యాణ్ నుండి అప్రూవ్‌ రావాల్సి ఉందని సమాచారం అందుతోంది.

టీజర్‌ లో ఆకర్షణీయమైన విజువల్స్ తో పాటు మంచి బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా ఫ్యాన్స్ కి కిక్‌ ఇచ్చే విధంగా ఉంటాయి అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. థమన్‌ ఇప్పటికే అదిరిపోయే మ్యూజిక్ బిట్‌ ఇవ్వడంతో సినిమా పై మరింత అంచనాలు పెరగడం ఖాయం అనే టాక్ కూడా వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్‌ తో సుజీత్‌ రూపొందిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ ఇమ్రాన్‌ హష్మీ కీలక పాత్రలో నటించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రియాంక అరుల్‌ మోహన్ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమా ను పాన్‌ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.