Begin typing your search above and press return to search.

నాన్న‌కి అచ్చు గుద్దిన‌ట్లే త‌న‌యుడు!

బాలీవుడ్ స్టార్ కిడ్స్ ఒక్కొక్క‌రుగా లాంచ్ అవుతోన్న విధానం తెలిసిందే. పిల్ల‌లంతా ఇష్ట‌మైన శాఖ‌ల‌వైపు కొత్త ప్ర‌యాణం మొద‌లు పెడుతున్నారు.

By:  Tupaki Desk   |   8 Jan 2024 3:45 AM GMT
నాన్న‌కి అచ్చు గుద్దిన‌ట్లే త‌న‌యుడు!
X

బాలీవుడ్ స్టార్ కిడ్స్ ఒక్కొక్క‌రుగా లాంచ్ అవుతోన్న విధానం తెలిసిందే. పిల్ల‌లంతా ఇష్ట‌మైన శాఖ‌ల‌వైపు కొత్త ప్ర‌యాణం మొద‌లు పెడుతున్నారు. విదేశాల్లో చ‌వుదులు పూర్తిచేసుకుని ఎంచ‌క్కా ముంబై వ‌చ్చి బాలీ వుడ్ లో దిగిపోతున్నారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన `ది అర్చీస్` తో ఎంత మంది స్టార్ కిడ్స్ ప‌రిచ‌య‌మ య్యారో తెలిసిందే. భ‌విష్య‌త్ లో ఇంకా చాలా మంది కిడ్స్ ప‌రిచ‌యం కానున్నారు.

అందులో ఒక‌రు నిర్వాణ్. బాలీవుడ్ న‌టుడు..ద‌ర్శ‌క నిర్మాత సోహైలీఖాన్ త‌న‌యుడే నిర్వాణ్‌. ఇటీవ‌లే నిర్వాణ తండ్రితో క‌లిసి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఓవీడియో లీక్ అయింది. ఇక నిర్వాణ్ లుక్ తండ్రికి అచ్చుగుద్దిన‌ట్లే ఉంది. వాకింగ్ స్టైల్...కెమెరా ముందు ఫోజు...ముఖంలో అమాయ‌క‌త్వం అన్ని ఒకేలా. అన్నింటికి మించి నిర్వాణ్ నాన్న‌కి అచ్చుగుద్దిన‌ట్లే ఉన్నాడు. అత‌డి ముఖంలో అన్నీ నాన్న పీచ‌ర్సే క‌నిపిస్తున్నాయి.

ముక్కు..చెవులు..క‌ళ్లు..హెయిర్ స్టైల్ ప్ర‌తీది సోహైలీ ఖాన్ లాగానే ఉన్నాయి. తండ్రి పెద్ద స్టార్ కాక‌పోయినా త‌న‌యుడు మాత్రం పెద్ద స్టార్ అవుతాడు? అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. హీరో క్వాలిటీస్ అన్ని నిర్వాణ్ లో పుష్క‌లంగా ఉన్నాయి. కాక‌పోతే వ‌య‌సు ఇంకా పెర‌గాలి. ప్ర‌స్తుతం నిర్వాణ్ చ‌దువుకుంటు న్నాడు. చ‌దువు పూర్త‌యిన త‌ర్వాత మ్యాక‌ప్ వేసుకునే అవ‌కాశం ఉంది.

ఇక స‌ల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో లెగ‌స్సీని నిర్వాణ్ కొన‌సాగించాలి. ఎందుకంటే స‌ల్మాన్ కి పెళ్లి చేసుకోలేదు పిల్ల‌లు లేరు కాబ‌ట్టి..స‌ల్మాన్ వార‌స‌త్వాన్ని కొనసాగించాల్సిన బాధ్య‌త నిర్వాణ్ పైనే ఉంది. సోహైలీఖాన్-స‌ల్మాన్ ఖాన్ సొంత అన్న‌ద‌మ్ములు అన్న సంగ‌తి తెలిసిందే.