Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. హౌస్ లో అత్నొచ్చాడు ఫుల్ ఎనర్జీ నింపేశాడు..!

బిగ్ బాస్ సీజన్ 9లో ఆఖరి కెప్టెన్సీ కోసం కంటెండర్స్ ని ఇదివరకు సీజన్లలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చారు.

By:  Tupaki Desk   |   28 Nov 2025 12:45 PM IST
బిగ్ బాస్ 9.. హౌస్ లో అత్నొచ్చాడు ఫుల్ ఎనర్జీ నింపేశాడు..!
X

బిగ్ బాస్ సీజన్ 9లో ఆఖరి కెప్టెన్సీ కోసం కంటెండర్స్ ని ఇదివరకు సీజన్లలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చారు. ఒక్కసారి మళ్లీ ఓల్డ్ సీజన్ కంటెస్టెంట్స్ ని హౌస్ లో చూసి బిగ్ బాస్ ఆడియన్స్ అంతా కూడా ఖుషి అయ్యారు. ఐతే వచ్చిన వారిలో బిగ్ బాస్ సీజన్ 4 టాప్ 3 కంటెస్టెంట్ సోహైల్ తన మార్క్ ఎంటర్టైనింగ్ తో అలరించాడు. అటు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు తన టైమింగ్ తో ఆడియన్స్ ని మెప్పించాడు.

సోహైల్ ని ఆట పట్టించాలని బిగ్ బాస్ కూడా..

ముఖ్యంగా హౌస్ లోకి వెళ్లిన సోహైల్ హౌస్ మేట్స్ అందరితో మాట్లాడాడు. ఆ తర్వాత వాళ్ల కోసం చికెన్ కేజీ, రెండు మిల్క్ ప్యాకెట్స్, ఒక కాఫీ పౌండర్ ని ఇవ్వమని బిగ్ బాస్ రిక్వెస్ట్ చేశాడు. బిగ్ బాస్ కి ఆర్డర్ వేస్తున్నట్టుగా చేస్తూ యాక్షన్ ఒకటి చేస్తూ రిక్వెస్టింగ్ మోడ్ లో మాటలు చెప్పాడు. అది గమనించిన హౌస్ మేట్స్ ఫుల్లుగా నవ్వుకున్నారు. ఐతే సోహైల్ ని ఆట పట్టించాలని బిగ్ బాస్ కూడా డిసైడ్ అయ్యాడు. అందుకే హౌస్ లోకి బొమ్మ చికెన్, మిల్క్ ప్యాకెట్, కాఫీ పౌడర్ బొమ్మలు పంపించాడు.

అది చూసి హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు. మరోసారి సోహైల్ బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేయగా ఈసారి నిజంగానే మిల్క్ ప్యాకెట్స్, చికెన్, కాఫీ పౌడర్ పంపించారు. ఐతే స్టోర్ రూం లోకి ముందు వెళ్లిన తనూజ, రీతు కాఫీ పౌడర్ ని దాచేసుకుంటారు. ఐతే అలా దాచేసిన కాఫీ పౌడర్ ని బిగ్ బాస్ సోహైల్ కి హింట్ ఇచ్చి తీసుకోమంటాడు. అలా హౌస్ లోకి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ అందరి కన్నా సోహైల్ వచ్చి తను కూడా ఈ సీజన్ హౌస్ మేట్ అనుకునేలా సరదాగా ఆటలు ఆడాడు.

సోహైల్ హౌస్ లో చేసిన హంగామా ఇటు ఆడియన్స్ ని..

ఇక ఇచ్చిన టాస్క్ లో సంజన, రీతూలను గెలిపించాలని సోహైల్ ఆట కూడా లైట్ తీసుకున్నాడు. ఫైనల్ గా తన ద్వారా సంజన, రీతూలను ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్స్ ని చేశాడు. సోహైల్ హౌస్ లో చేసిన హంగామా ఇటు ఆడియన్స్ ని కూడా అలరించింది. సీజన్ 4లో తనకు తానుగా సూట్ కేస్ తీసుకుని వెళ్లిన సోహైల్ తాను ఎలిమినేట్ అవ్వలేదు ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్ లోకి రావొచ్చంటూ చెప్పడం బిగ్ బాస్ లవర్స్ ని మెప్పించింది. మొత్తానికి హౌస్ లో సోహైల్ అటు హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాడు.

వెళ్తూ వెళ్తూ హౌస్ లో ఉన్న ఈ చివరి రెండు మూడు వారాలు ఎంజాయ్ చేయండి. బిగ్ బాస్ వల్లే తాను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. తప్పకుండా అందరు ఎవరికి వారు బెస్ట్ ఇవ్వండంటూ సోహైల్ హౌస్ మేట్స్ కి సజెషన్ ఇచ్చాడు.