Begin typing your search above and press return to search.

అప్పట్లో రోహిత్‌, కోహ్లీలతో ప్రేమ... ఇప్పుడు సన్యాసిని!

సెలబ్రిటీ హోదా అనేది అంత ఈజీగా రాదు. ముఖ్యంగా హీరోయిన్స్‌గా ఆఫర్లు రావాలంటే చాలా కష్టపడాలి.

By:  Tupaki Desk   |   15 Jun 2025 2:00 AM IST
అప్పట్లో రోహిత్‌, కోహ్లీలతో ప్రేమ... ఇప్పుడు సన్యాసిని!
X

సెలబ్రిటీ హోదా అనేది అంత ఈజీగా రాదు. ముఖ్యంగా హీరోయిన్స్‌గా ఆఫర్లు రావాలంటే చాలా కష్టపడాలి. ఒక్క సినిమా చేసినా కూడా చాలా గొప్ప విషయం. అలాంటిది బ్రిటన్ బ్యూటీ సోఫియా హయత్‌ పలు హిందీ సినిమాల్లో నటించడంతో పాటు, సుదీర్ఘ కాలం పాటు బుల్లి తెరపై సందడి చేసింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో అందాల ఆరబోత పాత్రలను చేయడం జరిగింది. అంతే కాకుండా ఆమె చేసిన పాత్రల కారణంగా వివాదాలు కూడా వచ్చాయి. అలాంటి పేరు ఉన్న సోఫియా హయత్‌ ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ఆమె ఇండస్ట్రీని వదిలేసింది, రంగుల ప్రపంచం పూర్తిగా వదిలేసిన సోఫియా హయత్ సన్యాసినిగా మారి సేవా జీవితాన్ని గడుపుతుంది.

సోషల్ మీడియాలో సోఫియా హయత్‌కి దాదాపుగా మిలియన్‌ ఫాలోవర్స్ ఉన్నారు. సుదీర్ఘ కాలం పాటు అందాల ఆరబోత పాత్రలతో, ఫోటో షూట్స్‌తో వీడియోలతో తెగ అలరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సన్యాసినిగా మారడంకు కారణం ఏంటి అంటే సరైన సమాధానం లేదు. కానీ ఈమె చుట్టూ ఉన్న పుకార్లు ఇప్పటికీ వైరల్‌ అవుతూ ఉంటాయి. చాలా ఏళ్ల క్రితం క్రికెటర్ రోహిత్‌ శర్మతో ప్రేమలో ఉందనే వార్తలు వచ్చాయి. అప్పుడు రోహిత్‌ శర్మతో ఉన్న ఈమె ఫోటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. అంతే కాకుండా ఆమెతో రోహిత్‌ శర్మ మాట్లాడాడు అంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. మొత్తానికి ఇద్దరి మధ్య వ్యవహారం గురించి ప్రముఖంగా చర్చ జరిగింది.

రోహిత్‌ శర్మతో మాత్రమే కాకుండా కోహ్లీ పేరు కూడా ప్రముఖంగా ప్రచారం జరిగింది. కోహ్లీతో సోఫియా హయత్‌ ప్రేమలో ఉందనే వార్తలు వచ్చాయి. అందుకు సాక్ష్యం ఇదుగో అంటూ కొన్ని మీడియా సంస్థలు అప్పట్లో తెగ హడావుడి చేశాయి. అప్పట్లో సోషల్‌ మీడియా ఇంతగా ప్రాచుర్యం లేదు కనుక ఎక్కువగా పబ్లిసిటీ కాలేదు. కానీ ఇద్దరి మధ్య పుకార్లు ఇండస్ట్రీలో బాగానే వినిపించాయి. ఇండస్ట్రీలో ఈమె చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా ఎక్కువగా మీడియాలో ఉండటం వల్ల ఎక్కువ గుర్తింపు దక్కించుకుంది. పాకిస్తాన్‌ మూలాలు ఉన్న బ్రిటన్‌ ముస్లీం ఫ్యామిలీలో జన్మించిన సోఫియా సినిమాలపై మోజుతో ఇండియాకు వచ్చింది.

ఇండియాలో సుదీర్ఘ కాలం పాటు మోడలింగ్‌ చేయడంతో పాటు, సినిమా ఇండస్ట్రీలో కొనసాగింది. అంతా బాగానే ఉందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా సోఫియా ఇలా సన్యాసినిగా కనిపించడం అందరికి షాకింగ్‌గా ఉంది. సోఫియా మోడల్‌గా ఉన్న సమయంలో ఫోటోలను, సన్యాసినిగా మారిన తర్వాత సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఫోటోలను కొందరు షేర్‌ చేస్తూ ఉన్నారు. రెండు ఫోటోలను కలిపి షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అందాల సోఫియా సన్యాసినిగా మారడం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది అంటూ చాలా మంది కామెంట్‌ చేస్తూ ఉంటారు. కొందరు మాత్రం రోహిత్‌ శర్మ, కోహ్లీ ల్లో ఇద్దరూ సోఫియా హయత్‌ ప్రేమను అంగీకరించని కారణంగా సన్యాసినిగా మారిందేమో అని ఫన్నీగా కామెంట్‌ చేస్తున్నారు. ఆమె ఏ కారణం వల్ల సన్యాసిని అయిందో కానీ ఎంతో మందికి ఆమె సేవ చేయడం మాత్రం మంచి విషయం.