Begin typing your search above and press return to search.

హ‌మ్మ‌య్య! ఇప్ప‌టికి ఒక‌టి క‌లిసొచ్చింది!

పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేష‌న్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం ఆడిషన్ కి వెళ్లిన రాశీకి చివ‌రి నిమిషంలో అవ‌కాశం మిస్స‌యింది.

By:  Tupaki Desk   |   17 Oct 2023 6:26 AM GMT
హ‌మ్మ‌య్య! ఇప్ప‌టికి ఒక‌టి క‌లిసొచ్చింది!
X

హిట్టును మాత్ర‌మే న‌మ్మే ప‌రిశ్ర‌మ మ‌న‌ది. ఇక్క‌డ స‌క్సెస్ లేనిదే ఏదీ లేదు. ఫ్లాపైతే ఆ త‌ర్వాత ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసి దూరం పెట్టేస్తారు. ఇటీవ‌ల అలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటోంది అందాల‌ రాశీఖ‌న్నా. ఈ బ్యూటీ గ‌తేడాది పక్కా కమర్షియల్- థాంక్యూ చిత్రాలతో వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొంది. ఆ త‌ర్వాత తెలుగులో ఒక్క‌టంటే ఒక్క అవ‌కాశం కూడా ద‌క్క‌లేదు.

ఒక అగ్ర హీరో ..ప‌లువురు యువ‌హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చివ‌రి నిమిషంలో ఛేజారాయి. పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేష‌న్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం ఆడిషన్ కి వెళ్లిన రాశీకి చివ‌రి నిమిషంలో అవ‌కాశం మిస్స‌యింది. ఆ పాత్ర చివరికి శ్రీలీలకి చేరింది. ఇదేగాక ప‌లువురు యువ‌హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు త‌న ప‌రిచ‌యాల‌తో డీప్ గా ప్ర‌య‌త్నించినా కానీ ఎవరూ ఛాన్సులివ్వ‌లేద‌ని గుస‌గుస వినిపించింది. స‌క్సెస్ ని మాత్ర‌మే న‌మ్మే ప‌రిశ్ర‌మ‌లో ఆ ఒక్క‌టీ రాక‌పోతే ఎలా ఉంటుందో ఈ సంధి కాలంలో అనుభ‌వ‌మైంది రాశీకి.

నెక్ట్స్ ఏంటి? అంటే.. ఇప్పుడు ఒక లేడీ డైరెక్ట‌ర్ రూపంలో రాశీకి ఒక్క ఛాన్స్ ద‌క్కింద‌ని తెలిసింది. సిద్ధు జొన్న‌ల గ‌డ్డ క‌థానాయ‌కుడిగా టాలీవుడ్ స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ క‌జిన్, స్టైలిస్ట్ నీర‌జ కోన ఓ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. 'తెలుసు క‌దా' అనే టైటిల్ ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో రాశీ క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. అయితే ఈ సినిమాతో త‌న‌కో హిట్టొస్తుందా లేదా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి. కోన నీర‌జ టాలీవుడ్ అగ్ర క‌థానాయిక‌లంద‌రికీ స్టైలిస్ట్ గా కొన‌సాగారు. స‌మంత‌, రాశీ ఖ‌న్నా, కాజ‌ల్ స‌హా ప‌లువురికి స్టైలిస్ట్ గా వ‌ర్క్ చేసారు. ఇప్పుడు ద‌ర్శ‌కురాలిగా స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఇది రాశీకి ఒక అవ‌కాశం తెచ్చింది.