సంపూర్ణేష్ బాబు సోదరా.. ట్రైలర్ టాక్ ఇలా..
హృదయ కాలేయం మూవీతో హీరోగా పరిచయం అయిన సంపూ.. డెబ్యూ ఫిల్మ్ తో మంచి మార్కులు కొట్టేశారు.
By: Tupaki Desk | 14 April 2025 9:45 AM ISTటాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు గురించి అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ర్టీలోకి వచ్చిన ఆయన.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఎంటర్టైన్మెంట్ అందించడమే లక్ష్యంగా మూవీస్ లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఆయన స్పెషల్ క్రేజ్ దక్కించుకున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
హృదయ కాలేయం మూవీతో హీరోగా పరిచయం అయిన సంపూ.. డెబ్యూ ఫిల్మ్ తో మంచి మార్కులు కొట్టేశారు. తన కామెడీతో ఓ రేంజ్ లో మెప్పించారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో యాక్ట్ చేశారు. కానీ కొన్నాళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఎలాంటి ప్రాజెక్టు అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు చిన్న గ్యాప్ తర్వాత సోదరా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
అన్నదమ్ముల ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథతో మూవీ రూపొందగా.. సంపూ లీడ్ రోల్ చేస్తున్నారు. సంజోష్, ప్రాచీబంసాల్, ఆరతి గుప్తా ఇతర ముఖ్య పాత్రలు చేస్తుండగా.. మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. ఏప్రిల్ 25వ తేదీన సినిమా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అదే సమయంలో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.
అందులో భాగంగా మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేసిన సోదరా మూవీ ట్రైలర్.. ఇప్పుడు మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారి తెగ చక్కర్లు కొడుతోంది. అందరినీ ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా సంపూ ఈ సారి భిన్నంగా సోదరా మూవీతో థియేటర్స్ లో సందడి చేయనున్నట్లు క్లియర్ గా ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
ట్రైలర్ ప్రకారం.. ఎంతో ప్రేమగా పెరిగిన ఇద్దరు అన్నదమ్ములు వారి పెళ్లి కోసం పడే కష్టాలే సినిమాగా తెలుస్తోంది. ఓ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు సంపూర్ణేష్ బాబు, సంజేష్ చాలా అన్యోన్యంగా ఉంటారు. ఒకరికి ఒకరు ప్రాణం ఇచ్చుకునేలా జీవిస్తారు. అయితే అన్న సంపూర్ణేష్ బాబుకు వివాహ సంబంధం ఖరారు అవుతుంది.
కానీ ఏదో సమస్య వస్తుంది. అయితే అసలేం జరిగింది? సమస్య ఏంటి? చివరికి ఏమైంది? అన్నది పూర్తి సినిమాగా తెలుస్తోంది. అయితే ట్రైలర్ బాగుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో ఉన్న స్టోరీలో అటు ఫ్యామిలీ ఎమోషన్ ఇటు యాక్షన్.. రెండూ సమపాళ్లలో ఉన్నట్లు తెలుస్తోందని అంటున్నారు.
అయితే సంపూ యాక్షన్ ఎప్పటిలానే బాగుంది. ఫ్రెష్ గా కనిపిస్తున్నారు. విజువల్స్ చాలా నేచురల్ గా ఉంటూ ఆకట్టుకుంటున్నాయి. సునీల్ కశ్యప్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పిస్తోంది. క్యాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చంద్ర చగంలా నిర్మించిన మూవీపై ట్రైలర్ మాత్రం మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.