Begin typing your search above and press return to search.

ట్రోల్స్‌ పై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు... తెరపైకి 'స్నేక్' బ్యాచ్!

ఫేస్ బుక్ - ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంస్ లోనూ చేసే ట్రోల్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   19 Aug 2023 8:09 AM GMT
ట్రోల్స్‌ పై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు... తెరపైకి స్నేక్ బ్యాచ్!
X

ప్రస్తుతం యూట్యూబ్ లోనూ.. ఫేస్ బుక్ - ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంస్ లోనూ చేసే ట్రోల్స్ వైరల్ అవుతుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముఖ్యంగా రాజకీయ నాయకులపైనా, మరి ముఖ్యంగా సినిమా వాళ్లపైనా ట్రోల్స్ విపరీతంగా నడుస్తుంటాయి. ఈ క్రమంలో ట్రోల్స్ పై మంచు విష్ణు స్పందించారు.

అవును... సినిమా రంగానికి చెందిన కొందరిని ప్రత్యేకంంగా టార్గెట్‌ చేస్తూ పలువురు ట్రోల్స్‌ చేస్తుంటున్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో కొన్ని హాస్యం అందించేవిగా సరదాగా ఉంటే... మరికొన్ని మాత్రం చికాకు పెట్టించే స్థాయిలో శృతిమించుతుంటాయి. ఈ విషయంలో మంచు ఫ్యామిలీని కొంతమంది టార్గెట్ చేసి మరీ ట్రోల్స్ చేస్తుంటారని అంటుంటారు.

ఈ క్రమంలో 'మా' ఎన్నికల నేపథ్యంలో మంచు మోహన్‌ బాబు కుటుంబంపై కొందరు పనికట్టుకుని ట్రోల్స్‌ చేస్తున్నారని వారి అభిమానులు పలు పోలీస్‌ స్టేషన్‌ లలో ఫిర్యాదులు కూడా చేశారు. అప్పటికి అవి ఏ మాత్రం తగ్గకపోవడంతో మంచు విష్ణు కలుగచేసుకుని పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ విషయాలపై ఆయన స్పందించారు.

తనపైనా, తన కుటుంబం పైనా ట్రోలింగ్స్ చేస్తున్నది, చేయిస్తున్నది ఎవరో ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ తెలుసని మంచు విష్ణు అన్నారు. ఇదేసమయంలో అది ఒక "స్నేక్‌" బ్యాచ్‌ చేస్తున్న పనే అని విష్ణు సంచలన కామెంట్లు చేశారు. అయితే.. అలాంటి ట్రోలింగ్స్ ను తాను పెద్దగా పట్టించుకోనని ఆయన తెలిపారు.

తాను ఎంచుకున్న రంగంలో సినిమా ఇండస్ట్రీ కూడా ఒకటి కావడంతో ట్రోల్స్ తప్పవని.. అయితే ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ వచ్చే ట్రోల్స్ నుంచి అందరికీ ఇబ్బందులు ఎదరవుతున్నాయని ఈ సందర్భంగా మంచు విష్ణు గుర్తు చేశారు. కొన్నిసార్లు అవి మితిమీరిపోతున్నాయని.. అలాంటి సమయంలో మాత్రం సహించేదిలేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా స్నేక్ బ్యాచ్ అనే టాపిక్ ని విష్ణు తెరపైకి తెచ్చారు. "మా ఎలక్షన్స్ ముందు వరకూ నాపై ట్రోలింగ్ ఉండేది కాదు.. ఎప్పుడైతే ఎలక్షన్స్‌ ప్రారంభం అయ్యాయో.. అప్పుడే నాపై ట్రోల్ చేయడం ప్రారంభించారు. అది ఎవరు చేయించారో అందరికీ తెలుసు. ఆ స్నేక్ బ్యాచ్ గురించి ఇప్పుడెందుకులే" అని మంచు విష్ణు తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించారు.

దీంతో ఆ ఇంటర్వ్యూ చేస్తోన్న జర్నలిస్ట్ ఆ స్నేక్ బ్యాచ్ కు హెడ్ ఫలానాయేనా అని స్పందించినప్పటికీ.. విష్ణు దాన్ని ఖండించారు. ఇదే సమయంలో ఆ స్నేక్‌ బ్యాచ్‌ ఎవరు..? దాని వెనుకున్నది ఎవరు? అనేది మాత్రం చెప్పే ప్రయత్నం చేయలేదు! దీంతో.. ఇప్పుడు ఈ "స్నేక్" బ్యాచ్ ఎవరనేదానిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ నడుస్తుంది!