ట్రెండీ టాక్ : స్కిన్ షో.. మనీ గేమ్ ఛేంజర్
ఇండియాలో టిక్ టాక్ రీల్స్ తో ఇలా చాలా మంది ఫేమస్ అయ్యి ఇప్పుడు స్కిన్ షోతో పెద్ద సెలబ్రిటీలు అయ్యారు.
By: Tupaki Desk | 13 May 2025 9:41 AM ISTఇండియాలో టిక్ టాక్ రీల్స్ తో ఇలా చాలా మంది ఫేమస్ అయ్యి ఇప్పుడు స్కిన్ షోతో పెద్ద సెలబ్రిటీలు అయ్యారు. స్కిన్ షోతో సోషల్ మీడియాల్లో భారీ ఫాలోవర్స్ ని సంపాదించి డబ్బు విపరీతంగా సంపాదిస్తున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టా, ఎక్స్ ఖాతాల్లో బోల్డ్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతూ నెటిజనులను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ ఫోటో సెలబ్రిటీలంతా, కేవలం ఆదాయం కోసమే ఇలా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
కొందరికి సినిమాల్లో చిన్న క్యారెక్టర్ కూడా ఉండదు.. కానీ ఇన్ స్టాలో మాత్రం విపరీతంగా ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకు అంటే స్కిన్ షో ఆకర్ష మంత్రం వర్కవుట్ అవ్వడం వల్లనే. ఇన్‌స్టా రీళ్లలో తల్లి కూతుళ్లు కలిసి స్కిన్ షో చేయడం అడ్వాన్స్ డ్ ట్రెండ్. అందాలు విశృంఖలంగా ఆరబోస్తూ ధనార్జనే ధ్యేయంగా రెచ్చిపోవడం చూస్తుంటే ఈ పాశ్చాత్య ధోరణికి షాక్ తినని వారు లేరు. సోషల్ మీడియాలతో సాంప్రదాయం సన్యాసం ఎత్తుకున్న రోజులివని నిరూపణ అవుతోంది.
సరైన సినిమాల్లేవ్.. పద్ధతైన మోడలింగ్ అసైన్ మెంట్స్ లేవ్.. టీవీ షోలు, రియాలిటీ షోలు ఏవీ లేవు.. కానీ సోకులకు విలాసాలకు కావాల్సినంత డబ్బు. అంత ధనం వీళ్లకు ఎలా చేకూరింది? అని ఆశ్చర్యపోవడం ఎదుటివారి వంతు. ఇదంతా కేవలం టిప్పు టాప్పు వగలమారి స్కిన్ షోతోనే సాధించుకున్నారా? సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్ పెంచుకుని డబ్బు సంపాదించడం అనే కళలో ఆరి తేరిన వీళ్లనే అడగాలి.
ఇటీవల బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్ చేసే డజను పైగా స్టార్లను పోలీసులు విచారించినప్పుడు కళ్లు భైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. ఇన్ స్టా, యూట్యూబ్ లు, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్ తో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ కోట్లలో సంపాదించారని కూడా కథనాలొచ్చాయి. వీళ్లలో చాలా మంది అప్పుడప్పుడు టీవీలు, సినిమాలు చూసే బాపతు ప్రజలకు తెలియనే తెలియరు. కానీ వీరంతా సెలబ్రిటీ హోదాను అనుభవించడం విస్తుగొలుపుతోంది. అధునాతన సమాజంలో యువతరం సాంకేతికతను ఉపయోగించి అడ్డగోలు సంపాదనకు అర్రులు చాచడం భయపెడుతోంది.
