Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : చీర కట్టులో అందాల తెనాలి గూఢచారి

2013 లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన ముద్దుగుమ్మ శోభితా ధూళిపాళ్ల.

By:  Tupaki Desk   |   23 Dec 2023 7:00 PM IST
పిక్ టాక్ : చీర కట్టులో అందాల తెనాలి గూఢచారి
X

2013 లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన ముద్దుగుమ్మ శోభితా ధూళిపాళ్ల. ఏపీలోని తెనాలి ప్రాంతానికి చెందిన ఈ అమ్మడు టాలీవుడ్‌ లో కాకుండా తన అదృష్టంను ముంబై వెళ్లి బాలీవుడ్‌ లో పరీక్షించుకుంది. అక్కడ మోడల్‌ గా రాణించడం ద్వారా నటిగా అవకాశాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.


హీరోయిన్ గా బాలీవుడ్‌ సక్సెస్ లను దక్కించుకున్న శోభితా టాలీవుడ్‌ లో గూఢచారి సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. రచ్చ గెలిచి ఇంట గెలిచిన శోభితా ప్రస్తుతం ఇక్కడ అక్కడ వరుస సినిమాల్లో నటిస్తోంది. కేవలం సినిమాల్లో హీరోయిన్‌ పాత్రలు మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సినిమాల్లో నటిస్తోంది.


మంచి పాత్ర, నటనకు ఆస్కారం ఉన్న వెబ్‌ సిరీస్ లను కూడా చేస్తోంది. తెలుగు అమ్మాయే అయినా కూడా ముంబై ముద్దుగుమ్మలకు ఏ మాత్రం తీసిపోకుండా అందంగా, అందాల ఆరబోత చేయడం ఈమె ప్రత్యేకత. చీర కట్టుతో పాటు మోడ్రన్ డ్రెస్ ల్లో ఈమె గతంలో షేర్‌ చేసిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి


తాజాగా చీర కట్టు ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ కి మరియు అభిమానులకు శోభిత షేర్‌ చేసింది. ఎప్పటిలాగే శోభిత చీర కట్టు, ముక్కుకు ముక్కు పుడకతో భలే ఉందే అంటూ అంతా కూడా ప్రశంసించే విధంగా మార్కులు దక్కించుకుంది. చీర కట్టులో అమ్మాయిలు అందంగా కనిపిస్తారు అనేందుకు శోభితా ధూళిపాళ్ల తాజా ఫోటో షూట్‌ పిక్స్‌ మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు.


ఇక ఈ అమ్మడు టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్‌ హీరో తో ప్రేమలో ఉన్నట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు క్లారిటీ రాలేదు. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే సితార సినిమాతో పాటు మరి కొన్ని సినిమాల్లో నటిస్తోంది. ఇదే సమయంలో ఒక ఇంగ్లీష్ సినిమాను కూడా ఈమె చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు లో ఈ అమ్మడు మరో గూఢచారి సినిమా తో రాబోతుంది.