Begin typing your search above and press return to search.

శోభిత బాలీవుడ్ టూ హాలీవుడ్ వ‌యా టాలీవుడ్!

తెనాలి బ్యూటీ శోభిత దూళిపాళ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు ఎంట్రీనే బాలీవుడ్ లో జ‌రిగింది.

By:  Tupaki Desk   |   30 Jan 2024 5:25 AM GMT
శోభిత బాలీవుడ్ టూ హాలీవుడ్ వ‌యా టాలీవుడ్!
X

తెనాలి బ్యూటీ శోభిత దూళిపాళ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు ఎంట్రీనే బాలీవుడ్ లో జ‌రిగింది. `రామ‌న్ రాఘ‌వ 2.0`..`చెఫ్` లాంటి సినిమాలో హిందీ ప్రేక్ష‌కుల్ని మెప్పించే ప్ర‌య‌త్నం చేసింది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో టాలీవుడ్ లోనూ లాంచ్ అయింది. స్పై థ్రిల్ల‌ర్ `గూఢ‌చారి`లో అవ‌కాశం రావ‌డంతో ఇక్క‌డ ఆమె లైఫ్ ఒక్క‌సారిగా కొత్త ట‌ర్నింగ్ తీసుకుంది. తొలి విజ‌యంతోనే బోలెడంత పాపులారిటీ సంపాదించింది.

అమ్మ‌డి పెర్పార్మెన్స్...బ్యూటీ ప్ర‌తిది శోభిత‌ని ప్ర‌త్య‌కంగా హైలైట్ చేసింది. అటుపై మ‌ల‌యాళం..త‌మిళ చిత్రాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆ ర‌కంగా శోభిత పాన్ ఇండియాలో ఓ వైబ్రేష‌న్ గా క‌నిపించింది. ఏ భాష‌ని ప్ర‌త్యేకంగా టార్గెట్ చేయ‌కుండా అన్ని భాష‌లు నావే అంటూ అన్ని ప‌రిశ్ర‌మ ల్లోనూ త‌న‌దైన ముద్ర వేసిం ది. `మేజ‌ర్` విజ‌యంతో ఇండియా అంత‌టా మ‌రోసారి పాపుల‌ర్ అయింది. మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్ని య‌న్ సెల్వ‌న్` లో సైతం న‌టించి స‌త్తా చాటింది.

ఓన‌టిగా శోభిత జ‌ర్నీ పాన్ ఇండియాలో చాలా వేగంగా పూర్తి చేసిందని చెప్పొచ్చు. తాజాగా శోభిత హాలీ వుడ్ లోనూ ఎంట్రీ షురూ చేసింది. ఏకంగా ఆస్కార్ విజేత చిత్రంలోనూ న‌టించే అరుదైన అవ‌కాశం ఒడిసి ప‌ట్టుకుంది. జోర్డాన్ పీలే నేతృత్వంలోని యూనివర్సల్ పిక్చర్స్ ప్రొడక్షన్ పై తెర‌కెక్కుతోన్న `మంకీ మ్యాన్లో` తో అరంగేట్రం చేస్తోంది. ఈ యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ దేవ్ పటేల్ తెర‌కెక్కిస్తున్నాడు. ఆయ‌నే లీడ్ రోల్ పోషిస్తున్నాడు.

ఇంకా పేరున్న హాలీవుడ్ న‌టులు న‌టిస్తున్నారు. వాళ్ల‌తో క‌లిసి తెలుగు అమ్మాయి శోభిత కూడా తెర‌ను పంచుకోవ‌డం విశేషం. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలతో మంకీ మ్యాన్ కి మంచి బ‌జ్ క్రియేట్ అయింది. `విప్లాష్`లాంటి సినిమాల‌కు ప‌నిచేసిన షారోన్ మీర్ ఈ సినిమాకి సినిమాటోగ్ర‌ఫ అందిస్తు న్నారు. ఆయ‌న మ్యాజిక్ ప్ర‌తి ప్రేమ్ లోనూ క‌నిపిస్తుంద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ట్రైల‌ర్ కి వ‌ర‌ల్డ్ వైడ్ గా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో శోభిత రిలీజ్ కి ముందే వ‌ర‌ల్డ్ అంత‌టా ఫేమ‌స్ అయిపో తుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.