Begin typing your search above and press return to search.

ఓర్రీ-శోభిత‌.. ఓర్రీ-దిశ .. ఏ పెయిర్ హాట్?

ఓర్హాన్ అవత్రామణి 500k పైగా అనుచరులతో ప్రముఖ సోషల్ మీడియా ప్రభావ‌శీలి. ఓర్రీ పేరుతో పాపుల‌ర‌య్యాడు

By:  Tupaki Desk   |   10 Nov 2023 3:48 PM GMT
ఓర్రీ-శోభిత‌.. ఓర్రీ-దిశ .. ఏ పెయిర్ హాట్?
X

ఓర్హాన్ అవత్రమణి ఎవరు? అంటూ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో డిబేట్ ర‌న్ అవుతోంది. సెల‌బ్రిటీ కిడ్స్ స‌హా స్టార్ హీరోయిన్ల‌కు అత్యంత స‌న్నిహితంగా మెలుగుతూ, రిల‌య‌న్స్ అంబానీల‌కు స‌న్నిహితుడుగా ఉంటూ.. బాలీవుడ్ ఈవెంట్ల‌లో ఓర్రీ చేస్తున్న హంగామా చూసాక ఇలా ఆరాలు తీయ‌డం మొద‌లైంది. అత‌డి గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది చాలా త‌క్కువ‌. తెలియాల్సింది చాలా ఉంది. కేవ‌లం ఈ దీపావ‌ళి సీజ‌న్ లోనే అత‌డు వ‌రుస పార్టీల్లో హాట్ గాళ్స్ తో చిల్ చేస్తూ సంచ‌ల‌నంగా మారాడు.


ఓర్హాన్ అవత్రామణి 500k పైగా అనుచరులతో ప్రముఖ సోషల్ మీడియా ప్రభావ‌శీలి. ఓర్రీ పేరుతో పాపుల‌ర‌య్యాడు. అతను తనను తాను గొప్ప‌ ప్రయాణికుడు, ఫ్యాషన్ ఐకాన్ గా అభివ‌ర్ణించుకున్నాడు. జెన్ జెడ్ బాలీవుడ్ తారల స్నేహితుడిని అని కూడా ప‌రిచ‌యం చేసుకున్నాడు. అతడు ఫ్యాషన్ షోలు, సినిమా ప్రీమియర్లు ..బాలీవుడ్ పార్టీలకు ముఖ్యంగా హాజరవుతాడు. అత‌డు స్టార్ కాదు.. గాయ‌కుడు కాదు.. 24శాఖ‌ల్లో ఎందులోను లేడు. కానీ అత‌డి చుట్టూనే ఇండ‌స్ట్రీ తిరుగుతోంది. అత‌డికి సంబంధించిన చాలా ఫోటోలు స్టార్ల‌తో క‌లిసి ఉన్న‌వే కావ‌డంతో అత‌డికి మ‌రింత పాపులారిటీ పెరిగింది.


ఇటీవల కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్‌లో ఓర్రీ సీక్రెట్ ప్రొఫైల్ గురించి సారాను అడిగారు. హోస్ట్ కరణ్ ఇలా అడిగాడు, ''ఓర్రీ ఎవరు.. ప్రపంచం తెలుసుకోవాలనుకుంటుంది?'' అని ప్ర‌శ్నించ‌గా, అతడు చాలా విషయాలలో ప్ర‌తిభావంతుడు.. నిజంగా ఫన్నీ ప‌ర్స‌నాలిటీ అని స‌మాధాన‌మిచ్చింది.

తాజాగా ఓర్రీ మ‌నీష్ పాపుల‌ర్ ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌ల్హోత్రా దీపావ‌ళి వేడుక‌ల్లో సందడి చేసాడు. అత‌డి చుట్టూ మ‌రోసారి గాళ్స్ గ్యాంగ్ చుట్టుముట్టారు. అందుకు సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. ''ఫోటో డంప్ లేకుండా ఏ పార్టీ కూడా పూర్తి కాదు!ఇది మనీష్ మల్హోత్రా దీపావళి బాష్‌లోనిది'' అంటూ పాప‌ల‌ర్ బాలీవుడ్ వెబ్ సైట్ ఈ ఫోటోల‌ను షేర్ చేసింది. ఈ ఫోటోగ్రాఫ్స్ లో దిశాప‌టానీతో, తెలుగ‌మ్మాయి శోభిత ధూళిపాల‌తో ఓర్రీ సిగ్నేచ‌ర్ ఫోజ్ హాట్ టాపిక్ గా మారింది. #ఓరి #మనీష్ మల్హోత్రా #ఇషాఅంబానీ #శ్లోకా అంబానీ #అనన్యపాండే #సరాలిఖాన్ #శోభితాధుళిపాల #వరుంధావన్ #సల్మాన్ ఖాన్ #దిశాపటాని #ఖుషికపూర్.. అంటూ హ్యాష్ ట్యాగుల్ని జోడించింది. వీరంతా మ‌నీష్ మ‌ల్హోత్రా పార్టీలో పాల్గొన్నారు. హాట్ గాళ్స్ తో అతడి ఫోజులు మ‌తులు చెడ‌గొడుతున్నాయి. ఓర్రీలో అంత మ్యాజిక్ ఏం ఉందో కానీ, గాళ్స్ అంతా అత‌డిని ఫ‌న్నీ బోయ్ అంటూ పిలుస్తున్నారు. ప్ర‌శంస‌ల జ‌ల్లుల్లో ముంచెత్తుతున్నారు. దీనిని బ‌ట్టి ఫ‌న్ ని పండించే బోయ్ కి పార్టీల్లో గొప్ప ఇమేజ్ ఉంటుంద‌ని అర్థం చేసుకోవాలి.