Begin typing your search above and press return to search.

కెరీర్ కోసం టాస్ వేసిన ఏకైక హీరోయిన్

ఈ సందర్భంగా తన గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

By:  Tupaki Desk   |   21 July 2023 12:48 PM GMT
కెరీర్ కోసం టాస్ వేసిన ఏకైక హీరోయిన్
X

బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా తన కెరియర్ ని కొనసాగిస్తోన్న తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ళ. వైజాగ్ కి చెందిన ఈ చిన్నది ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టి అందాల పోటీలలో పాల్గొంది. అక్కడి నుంచి రమణ్ రాఘవ సినిమాతో బాలీవుడ్ లోకి నటిగా అడుగుపెట్టింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా సినిమాలు చేస్తూ వస్తోంది.

ఇప్పటికే హాలీవుడ్ లోకి కూడా ఈ అమ్మడు అడుగుపెట్టింది. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాలో శోభిత దూళిపాళ్ళ కీలకపాత్రలో కనిపించింది. పరాయిభాషల్లో సిక్స్ అవుతున్న ఈ చిన్న తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు సొంతం చేసుకోవడం లేదనే చెప్పాలి. ఇప్పటి వరకు టాలీవుడ్ లో రెండే సినిమాలు శోభిత చేసింది. అవి కూడా అడవి శేష్ హీరోగా తెరకెక్కిన గూఢచారి, మేజర్ చిత్రాలలో నటించింది.

రీసెంట్ గా ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ తో శోభిత ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇందులో సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ తో రొమాంటిక్ సన్నివేశాలలో శోభిత నెక్స్ట్ లెవల్ లో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ హిందీలో సూపర్ హిట్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ హిందీలో కపిల్ శర్మ షోలో పార్టిసిపేట్ చేసింది. ఈ సందర్భంగా తన గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

వైజాగ్ లో ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత పెద్ద సిటీస్ కి వెళ్లాలని అనుకున్న. ఆ సమయంలో నా ఛాయస్ బెంగుళూరు, ముంబై. అయితే ఈ రెండింటిలో ఎక్కడికి వెళ్లాలని అనుకున్నప్పుడు కాయిన్ తో టాస్ వేశాను ముంబై ఛాయస్ గా వచ్చింది. వెంటనే ముంబైలో అడుగుపెట్టాను. ఆ నిర్ణయం నా లైఫ్ మొత్తాన్ని మార్చేసింది అని రివీల్ చేసింది.

కపిల్ శర్మ షోలో సరదాగా 12వ తరగతి కంప్లీట్ అయిన తర్వాత కెరియర్ గురించి తాను ఏ విధంగా నిర్ణయం తీసుకున్నాను అనేది శోభిత చెప్పడం విశేషం. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.