నైట్ వేర్ లో శోభిత.. అక్కినేని కోడలి కొత్త పిక్స్ చూశారా?
నటి శోభిత ధూళిపాళ్ల అక్కినేని గురించి అందరికీ తెలిసిందే. నేషనల్ తో పాటు ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న అమ్మడు.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్.
By: Tupaki Desk | 5 Jun 2025 8:50 PM ISTనటి శోభిత ధూళిపాళ్ల అక్కినేని గురించి అందరికీ తెలిసిందే. నేషనల్ తో పాటు ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న అమ్మడు.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ షేర్ చేసే శోభిత.. అందాలు ఆరబోస్తూనే ఉంటోంది. గ్లామర్ షోతో నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంటుంది అమ్మడు.
తాజాగా నయా పిక్స్ ను పోస్ట్ చేసిన అమ్మడు.. ఒక్కసారిగా వైరల్ గా మారింది. క్రీమ్ కలర్ నైట్ వేర్ లో ఫొటోలు దిగిన శోభిత.. రకరకాల పోజులు ఇచ్చి అలరించిందనే చెప్పాలి. వాల్ చైర్ లో కూర్చుని సేద తీరుతూ రిలాక్స్డ్ గా కనిపించారు. హెయిర్ లీవ్ చేసి కొంటె చూపుతో ఆకట్టుకుంది శోభిత.
ప్రస్తుతం ఆమె కొత్త పిక్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఫొటోస్ అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒక్క పోజ్ వేరే లెవెల్ అని చెబుతున్నారు. కూల్ అండ్ రిలాక్స్డ్ గా ఉంటూనే ఆకట్టుకుంటున్నారని సందడి చేస్తున్నారు. మేడమ్ సర్ మేడమ్ అంతే అంటున్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి చెందిన శోభిత.. టీనేజ్ లోనే మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2013లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని కిరీటాన్ని జస్ట్ మిస్ అయింది. ఆ తర్వాత అదే ఏడాది మిస్ ఎర్త్ ఇండియా పోటీలకు వెళ్లిన శోభిత.. ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ దక్కించుకుందనే చెప్పాలి.
అయితే బాలీవుడ్ మూవీ రామన్ రాఘవ్ 2.0తో సినీ ఇండస్ట్రీలోకి శోభిత అడుగులు పడ్డాయి. ఆ తర్వాత చెఫ్, కళాకంది వంటి పలు హిందీ సినిమా అవకాశాలు వచ్చాయి. యంగ్ హీరో అడివి శేష్ గూఢచారి మూవీతో టాలీవుడ్ లోకి వచ్చింది అమ్మడు. అందులో తన అందం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి.
అక్కడికి కాస్త గ్యాప్ తర్వాత మేజర్ మూవీలో కనిపించింది. రీసెంట్ గా హాలీవుడ్ లోకి కూడా వెళ్లిన శోభిత.. మంకీ మ్యాన్ లో వేశ్య పాత్రలో యాక్ట్ చేయడం గమనార్హం. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో గ్లామర్ షోతో మెప్పించిన అమ్మడు.. భారీ ప్రాజెక్టుల్లో నటించేందుకు వెయిట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఫ్యూచర్ లో ఏ చిత్రాల్లో నటిస్తుందో చూడాలి.
