టాలీవుడ్ హీరోయిన్ల ప్రెగ్నెన్సీ లో నిజమెంత?
ఈ నేపథ్యంలో టాలీవుడ్ లోని ఇద్దరు హీరోయిన్లు ప్రెగ్నెంట్స్ అని వార్తలొస్తున్నాయి. వారు మరెవరో కాదు, శోభితా ధూళిపాళ మరియు లావణ్య త్రిపాఠి.
By: Tupaki Desk | 2 May 2025 11:00 PM ISTహీరోయిన్ల మీద రూమర్లు రావడం చాలా కామన్. పెళ్లికి ముందు ఫలానా హీరోతో రిలేషన్ లో ఉందని, ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకోనుందని రూమర్లు వస్తే పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ గురించి వార్తలొస్తుంటాయి. ఒకప్పుడు ఇలాంటి వార్తలు, గాసిప్పులు బాలీవుడ్ లో ఎక్కువగా వినిపించేవి. అది ఇప్పుడు టాలీవుడ్ కి కూడా వ్యాపించింది.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ లోని ఇద్దరు హీరోయిన్లు ప్రెగ్నెంట్స్ అని వార్తలొస్తున్నాయి. వారు మరెవరో కాదు, శోభితా ధూళిపాళ మరియు లావణ్య త్రిపాఠి. వరుణ్ తేజ్ తో ఆరేళ్ల పాటూ రిలేషన్ లో ఉన్న లావణ్య, 2023లో అతన్ని పెళ్లి చేసుకుని మెగా కోడలైన విషయం తెలిసిందే. ఇప్పుడు వారిద్దరూ తమ మొదటి బిడ్డను కనబోతున్నారని తెగ వార్తలు వినిపిస్తున్నాయి.
ఆల్రెడీ ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటూ మెగా జంటకు విషెస్ తెలియచేస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా లావణ్య తన యాక్టింగ్ కెరీర్ ను కంటిన్యూ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా లావణ్య షూటింగ్ నుంచి కొంత బ్రేక్ తీసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. లావణ్య ప్రెగ్నెంట్ అవడం వల్లే షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుందని అంటున్నారు.
లావణ్యతో పాటూ శోభితా ధూళిపాల చుట్టూ కూడా ఇవే వార్తలు తిరుగుతున్నాయి. అక్కినేని నాగచైతన్య, శోభిత గత డిసెంబర్ లో పెళ్లి చేసుకోగా ఇప్పుడు వీరిద్దరూ ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా నాగ చైతన్య తన ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫోటోల్లో చైతన్య ఎలాంటి క్లూ ఇవ్వకపోయినప్పటికీ నెటిజన్లు మాత్రం శోభిత ప్రెగ్నెంట్ అంటూ మాట్లాడుకుంటున్నారు.
దానికి తగ్గట్టే శోభిత రీసెంట్ గా జరిగిన WAVES 2025 సమ్మిట్ కు తన భర్త చైతన్య తో కలిసి హాజరైంది. అయితే శోభిత ఎప్పటిలా కాకుండా ఈసారి కాస్త భిన్నంగా చీరలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటూ, రీసెంట్ గా శోభిత పెద్దగా తన కెరీర్ ను లైట్ తీసుకోవడం ఈ వార్తలను బలపరుస్తున్నాయి. వాస్తవమేంటో తెలీదు కానీ మెగా, అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఆల్రెడీ ఈ విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు.