Begin typing your search above and press return to search.

విలేజ్ కల్చర్ ను ఆస్వాదిస్తున్న అక్కినేని కోడలు.. పిక్స్ చూశారా?

పెళ్లి అయ్యాక పెద్దగా సినిమాల్లో కనిపించని శోభిత.. ఎప్పటికప్పుడు టూర్స్ కు వెళ్తోంది. వెకేషన్స్ కు వెళ్లతూ ఫుల్ గా చిల్ అవుతున్నట్లు కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   3 July 2025 10:55 AM IST
విలేజ్ కల్చర్ ను ఆస్వాదిస్తున్న అక్కినేని కోడలు.. పిక్స్ చూశారా?
X

టాలీవుడ్ హీరోయిన్, అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల గురించి అందరికీ తెలిసిందే. మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆమె.. ఆ తర్వాత హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది. తనకంటూ స్పెషల్ గుర్తింపు సొంతం చేసుకుంది. కొన్ని నెలల క్రితం యంగ్ హీరో నాగచైతన్యను వివాహం చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది అమ్మడు.


పెళ్లి అయ్యాక పెద్దగా సినిమాల్లో కనిపించని శోభిత.. ఎప్పటికప్పుడు టూర్స్ కు వెళ్తోంది. వెకేషన్స్ కు వెళ్లతూ ఫుల్ గా చిల్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా.. ఫుల్ వైరల్ అవుతున్నాయి. తెగ చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు సందడి చేస్తున్నాయి.


ఇటీవల తమిళనాడు వెళ్లిన శోభిత.. అక్కడ విలేజ్ కల్చర్ ను ఆస్వాదించినట్లు ఉన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సింపుల్ జీన్ డ్రెస్ వేసుకున్న శోభిత.. సరదాగా గడిపారు. కెమెరాలో పిక్స్ తీస్తూ.. అక్కడ ఉన్న మహిళలతో మాట్లాడుతూ.. కొబ్బరి బోండాం తాగుతూ.. పచ్చని ప్రకృతిని ఆస్వాదించింది శోభిత.


ఇప్పుడు నెటిజన్లు రెస్పాండ్ అవుతూ పిక్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. స్టైలిష్ లుక్ సూపర్ అంటున్నారు. శోభిత గడిపిన మధుర క్షణాలు అద్భుతమని కామెంట్లు పెడుతున్నారు. లైక్స్ కొడుతూ.. కామెంట్స్ పెడుతూ.. షేర్ చేస్తూ.. సందడి చేస్తున్నారు. దీంతో ఇప్పుడు శోభిత పిక్స్.. సోషల్ మీడియాలో తెగ కనిపిస్తున్నాయి.


ఇక శోభిత విషయానికొస్తే.. రామన్ రాఘవ్ 2.0 సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శోభిత దూళిపాళ్ల.. మొదట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులోకి వచ్చిన అమ్మడు.. అడవి శేష్ హీరోగా చేసిన గూఢచారి సినిమాతో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చింది. మంచి హిట్ కూడా అందుకుంది.


ఆ తర్వాత మేజర్ సినిమాలోనూ ఒక కీలక పాత్రలో ఆకట్టుకుందీ అక్కినేని కోడలు. కొన్ని రోజుల క్రితం మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ది నైట్ మేనేజర్ వంటి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీసుల్లో నటించింది. ఇప్పుడు పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. మరి బ్యాక్ గ్రౌండ్ లో ఏమైనా నటిస్తూ.. సడెన్ సర్ప్రైజ్ గా అనౌన్స్ చేస్తారేమో వేచి చూడాలి.