గుసగుస: 12 కోట్లు వసూలు చేస్తున్నాడని పక్కన పెట్టారు!
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడిని టాలీవుడ్ దర్శక నిర్మాతలు కావాలనే పక్కన పెడుతున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
By: Sivaji Kontham | 1 March 2026 7:00 PM ISTటాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడిని టాలీవుడ్ దర్శక నిర్మాతలు కావాలనే పక్కన పెడుతున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇళయరాజా, కీరవాణి, మణిశర్మ, రాజ్ కోటి వంటి దిగ్గజాల తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న సదరు పాపులర్ సంగీత దర్శకుడు దశాబ్ధాలుగా ఇండస్ట్రీని ఏల్తున్నాడు. ఇటీవల 1000 కోట్ల క్లబ్ సినిమాకి సంగీతం అందించాడు. ఆ తర్వాత అతడి తీరు తెన్నులు అమాంతం మారిపోయాయి. పారితోషికాన్ని భారీగా పెంచేసినట్లు సమాచారం. గతంలో ఒక్కో సినిమాకు 6 కోట్లు తీసుకున్న అతడు, ఇప్పుడు ఏకంగా 12 కోట్లు ప్లస్ జీఎస్టీ డిమాండ్ చేస్తున్నారట. ఈ భారీ పెంపుతో బడ్జెట్ భారమవుతుందని భావిస్తున్న నిర్మాతలు ఇప్పుడు ఇతర ఆప్షన్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మరోవైపు ఈ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ థింకింగ్ కి పూర్తి ఆపోజిట్ ఫార్ములాతో పోటీలో ఉన్న మరో అగ్ర సంగీత దర్శకుడు అన్ని సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అతడు తెలివిగా టాలీవుడ్ దర్శకనిర్మాతల మైండ్ ని రీడ్ చేసి వారిని తనవైపు తిప్పేసుకుంటున్నాడని చాలా కాలంగా కథనాలొస్తున్నాయి. ఈ సంగీత దర్శకుడు అతడి కంటే తక్కువ పారితోషికం తీసుకోవడమే కాకుండా.. బ్యాక్-టు-బ్యాక్ హిట్లతో నిర్మాతలకు మంచి రిటర్నులు అందిస్తున్నారు. అంతేకాదు.. తక్కువ సమయంలో స్పీడ్ వర్క్ తో ఔట్‌పుట్ ఇచ్చే ఇతడి సామర్థ్యం టాలీవుడ్ నిర్మాతలకు ప్లస్ పాయింట్‌గా మారింది. అతడి టైమ్ టేకింగ్ ప్రాసెస్ కూడా ఇతడికి ప్లస్ గా మారుతోంది. అందుకే అగ్ర హీరోలంతా ఇప్పుడు ఈ రెండో టాపర్ వెంట పడుతున్నారు. అదే సమయంలో కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ల వైపు చూస్తున్నారు.
ఇక ఇటీవల `మన శంకర వర ప్రసాద్ గారు` అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో వంటి వారు కూడా రేసులోకి వచ్చారు. సుమారు 2 కోట్ల లోపే పారితోషికం తీసుకుంటూ క్వాలిటీ మ్యూజిక్ ఇస్తున్న వీరిని మేకర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే యువన్ శంకర్ రాజా వంటి సీనియర్లు కూడా రీజనబుల్ రేటులోనే అందుబాటులో ఉండటం 12 కోట్లు అడుగుతున్న టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కి ప్రతికూలంగా మారింది. టాలీవుడ్ లో ప్రస్తుతం సరైన ఆల్టర్నేటివ్ లేకపోవడంతో నిర్మాతలు పక్క రాష్ట్రాల నుండి అనిరుధ్, హారిస్ జైరాజ్ వంటి వారిని పిలిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గతంలో రాజ్-కోటి, మణిశర్మ, కీరవాణి వంటి వారు ఉన్నప్పుడు టాలీవుడ్ మ్యూజిక్ ఇతర పరిశ్రమలపై ఆధారపడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఆ స్థాయి క్రియేటివిటీ ఉన్న వారసులు టాలీవుడ్‌లో ఇంకా స్థిరపడకపోవడం విచారకరం. క్రియేటివిటీ కంటే కమర్షియల్ లెక్కలకే ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత తరుణంలో, కొత్త రక్తం ఇండస్ట్రీలోకి రాకపోతే టాలీవుడ్ ఎప్పుడూ పక్క రాష్ట్రాల సంగీత దర్శకులపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఒకరిద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల మీద ఆధారపడటం వల్ల వారి రెమ్యూనరేషన్లు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ప్రతిభావంతుడే అయినా కానీ తన పారితోషికం విషయంలో కొంచెం తగ్గకపోతే భవిష్యత్తులో అవకాశాలు మరింత తగ్గే ప్రమాదం ఉంది. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన మణిశర్మ వంటి వారే రెమ్యూనరేషన్, వర్క్ స్టైల్ వల్ల వెనకబడ్డారని ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు అతడు కూడా అదే బాటలో వెళ్తున్నారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదేమైనా, టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు తమ రేటుతో పాటు క్వాలిటీని, మార్కెట్ అవసరాలను బ్యాలెన్స్ చేయకపోతే నిర్మాతలను ఆదుకోవడానికి, ఇండస్ట్రీని ఉద్ధరించడానికి ఎప్పుడూ ఎవరో ఒకరు ఎక్కడి నుంచో రావాల్సిందే.
