Begin typing your search above and press return to search.

పుష్ప రాజ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. స్నేహ స్టన్నింగ్

తెలుగు సినీ నటీనటులతో పాటు మెగా వారసులంతా అల్లు అర్జున్ క్రేజీ పిక్స్, స్పెషల్ ఫోటోలు షేర్ చేస్తూ పోస్టులు పెట్టారు.

By:  Tupaki Desk   |   8 April 2024 12:40 PM GMT
పుష్ప రాజ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. స్నేహ స్టన్నింగ్
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. తగ్గేదేలే అంటూ పుష్ప-2 పోస్టర్స్ షేర్ చేసి విష్ చేస్తున్నారు. ఫ్యాన్స్ తో పాటు బన్నీ మామయ్యలు చిరంజీవి, పవన్, నాగబాబు స్పెషల్ విషెస్ తెలిపారు. తెలుగు సినీ నటీనటులతో పాటు మెగా వారసులంతా అల్లు అర్జున్ క్రేజీ పిక్స్, స్పెషల్ ఫోటోలు షేర్ చేస్తూ పోస్టులు పెట్టారు.


అయితే ఆదివారం రాత్రి బన్నీ సతీమణి స్నేహ రెడ్డి.. ఇంట్లోనే గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించిన పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. అల్లు అర్జున్ బర్త్ డే పార్టీలో వైట్ డ్రెస్ లో స్నేహ స్టన్నింగ్ గా ఉంది. తన మిర్రర్ సెల్ఫీని కూడా షేర్ చేసింది. అయితే పార్టీలో బర్త్ డే కేక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. కెరీర్ లో ఐకాన్ స్టార్ సాధించిన ఎన్నో ఘనతలను కేక్ పై డెకరేషన్ గా చేయించింది స్నేహ.


ఇటీవల అల్లు అర్జున్ మైనపు విగ్రహ ఆవిష్కరణ దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ పిక్ కూడా కేక్ పై ఉంది. ఇక ఈ పార్టీలో బన్నీ చాలా సింపుల్ గా కనిపించారు. వైట్ ట్రౌజర్ తో పాటు కలర్ ఫుల్ టీ షర్ట్ లో సందడి చేశారు. నటుడు నవదీప్.. పార్టీకి అటెండ్ అయ్యి ఓ బొన్సాయ్ మొక్కను గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ ఫోటోను నవదీప్ షేర్ చేసి.. పుట్టినందుకు థ్యాంక్స్ బావా అంటూ పోస్ట్ పెట్టారు.


ఇక తమ ఫేవరెట్ హీరో బర్త్ డే సందర్భంగా.. పెద్ద ఎత్తున అభిమానులు ఆదివారం రాత్రి బన్నీ ఇంటి ముందు గుమిగూడారు. ఆయనకు విషెస్ చెప్పడానికి భారీగా తరలివచ్చారు. అర్ధరాత్రి తర్వాత అల్లు అర్జున్.. ఇంటి నుంచి బయటకు వచ్చి తన ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఫ్లయింగ్ కిస్ లు కూడా ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అల్లు అర్జున్.


ఏటా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటి వద్దకు ఫ్యాన్స్ రావడం ఆనవాయితీగా మారింది. ఇక త్వరలో పుష్ప-2తో ఐకాన్ స్టార్ ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఈ బర్త్ డే మరింత స్పెషల్ గా మారింది. పుట్టినరోజు కానుకగా పుష్ప-2 టీజర్ ను ఆ సినిమా మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మరి ఈ చిత్రంతో బన్నీ.. ఎలాంటి హిట్ కొడతారో వేచి చూడాలి.