స్నేహా రెడ్డి ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. నాకేం కావాలంటే?
పుష్ప2 సినిమాతో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.
By: Tupaki Desk | 7 April 2025 4:20 PM ISTపుష్ప2 సినిమాతో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. పుష్ప, పుష్ప2 సినిమాలతో బన్నీ అందుకున్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు. హీరోగా బన్నీకి ఎంత ఫాలోయింగ్ ఉందో, తన భార్యగా స్నేహా రెడ్డికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్నేహా రెడ్డికి ఇన్‌స్టాలో మంచి క్రేజ్ ఉంది.
ఇన్ స్టా లో రెగ్యులర్ గా తమ పిల్లల ఫోటోలకు, వీడియోలతో పాటూ తమ పర్సనల్ విషయాలను, హెల్త్ టిప్స్ ను అందిస్తూ స్నేహా తన ఫాలోవర్లకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. అందుకే స్నేహా అకౌంట్ కు సోషల్ మీడియాలో ఫాలోవర్లతో పాటూ రీచ్ కూడా ఎక్కువ.
ఇదిలా ఉంటే తాజాగా స్నేహా తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆ స్టోరీలో హాస్పిటల్ లో ఓ అమ్మాయికి రక్తం ఎక్కిస్తుండగా, ఆ బ్లడ్ ప్యాకెట్ పై ట్రావెల్ అని రాసి ఉంది. ఆ ఫోటోను షేర్ చేస్తూ నాకు ప్రస్తుతం ఏం కావాలంటే.. అని క్యాప్షన్ ను రాసుకొచ్చింది స్నేహా. ఆమె షేర్ చేసిన పోస్ట్ చూసి అల్లు అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.
ఎప్పుడూ లేనిది స్నేహా ఇలాంటి స్టోరీ పెట్టిందేంటని కొందరు అనుకుంటుంటే, అల్లు ఫ్యామిలీలో ఎవరికైనా బాలేదా, వారికి రక్తం కావాలా అని మరికొందరు అంటున్నారు. ఇంకొందరు స్నేహాకే ఆరోగ్యం బాలేదని, హాస్పిటల్ లో జాయినైందని ఆ విషయాన్ని హింట్ ఇస్తూనే ఆమె ఈ పోస్ట్ చేసిందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి స్నేహా షేర్ చేసిన ఈ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
బన్నీ, స్నేహకు 2011లో పెళ్లైంది. వీరిద్దరూ ప్రేమించుకుని ఇరు కుటుంబాలను ఒప్పించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు. అల్లు అర్జున్ కు ఎలాగైతే ఫ్యాన్స్ ఉన్నారో అలానే వీరి క్యూట్ ఫ్యామిలీకి కూడా అలానే సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక బన్నీ విషయానికొస్తే ప్రస్తుతం పుష్ప2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ, తన తర్వాతి సినిమా కోసం రెడీ అవుతున్నాడు.
