Begin typing your search above and press return to search.

స్నేహ రెడ్డి స్టైలిష్ లుక్.. హీరోయిన్ కు మించిన అందంతో..

బేబీ పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్‌ లో స్నేహ రెడ్డి ఎంతో ఎలిగెంట్‌ గా కనిపించారు. సింపుల్ మేకప్, నేచురల్ హెయిర్ స్టైల్‌ తో క్లాస్ లుక్‌ లో మెరిసిపోయారు.

By:  Tupaki Desk   |   1 Feb 2026 2:05 PM IST
స్నేహ రెడ్డి స్టైలిష్ లుక్.. హీరోయిన్ కు మించిన అందంతో..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి పేరు చెప్పగానే సోషల్ మీడియాలో ప్రత్యేక క్రేజ్ గుర్తుకు వస్తుంది. సినీ రంగానికి నేరుగా సంబంధం లేకపోయినా.. స్టార్ హీరోయిన్‌ లకు ఏమాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం. స్నేహ ఏ ఫోటో పోస్ట్ చేసినా క్షణాల్లోనే లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ రావడం సహజం.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే స్నేహ… తన ఫ్యామిలీ మూమెంట్స్, ట్రావెల్ పిక్స్, పర్సనల్ అప్డేట్స్‌ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆమె స్టైలిష్ ఫోటో షూట్స్ నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. తాజాగా షేర్ చేసిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌ గా మారాయి.

బేబీ పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్‌ లో స్నేహ రెడ్డి ఎంతో ఎలిగెంట్‌ గా కనిపించారు. సింపుల్ మేకప్, నేచురల్ హెయిర్ స్టైల్‌ తో క్లాస్ లుక్‌ లో మెరిసిపోయారు. డ్రెస్సుకు మ్యాచ్ అయ్యేలా ఆమె క్యారీ చేసిన చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింపుల్ అయినా స్టైలిష్‌ గా ఉన్న ఆ బ్యాగ్ మొత్తం లుక్‌ కు మరింత గ్రేస్ తీసుకొచ్చిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

అల్లు స్నేహ ఫోటోలు షేర్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మేడమ్ సో ప్రెట్టీ, గార్జియస్, లుకింగ్ ఫ్యాబులస్, హీరోయిన్‌ లకు ఏమాత్రం తగ్గట్లేదు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సెలబ్రిటీలు, అల్లు అర్జున్ అభిమానులు కూడా కామెంట్లతో హంగామా చేస్తున్నారు. సూపర్ వదినమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట తెగ షేర్ చేస్తూ.. ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు.

పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్ ఉన్నప్పటికీ… అల్లు అర్జున్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత స్నేహ రెడ్డి మరింత పాపులర్ అయ్యారు. ఆ జంటకు కుమారుడు అయాన్, కూతురు అర్హ ఉన్నారు. కుటుంబ బాధ్యతలను చక్కగా చూసుకుంటూనే సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌ గా ఉంటూ అభిమానులను అలరిస్తుంటారు. ఫ్యాషన్ విషయంలో స్నేహ ఎంపికలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. ట్రెండీ డ్రెస్సులు, క్లాసిక్ స్టైలింగ్, సింపుల్ యాక్సెసరీస్‌ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఆమె ఫోటో షూట్స్ యువతకు ఫ్యాషన్ ఇన్‌స్పిరేషన్‌ గా మారుతున్నాయనే చెప్పాలి.