ఆ హీరో అంటే చాలా ఇష్టం
సౌత్ హీరోయిన్ స్నేహ తాజాగా తనకు ఇష్టమైన హీరో గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
By: Tupaki Desk | 17 Jun 2025 2:00 AM ISTసాధారణ ప్రేక్షకులకే కాదు, సినిమాల్లో నటించే హీరోలకీ, హీరోయిన్లకు కూడా అభిమాన నటీనటులుంటారు. అయితే కొంతమంది తమ అభిమాన నటీనటుల గురించి బయటకు చెప్తే మరికొందరు మాత్రం తమ యిష్టాయిష్టాలను మనసులోనే దాచుకుని అభిమానిస్తుంటారు. సౌత్ హీరోయిన్ స్నేహ తాజాగా తనకు ఇష్టమైన హీరో గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసి ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న స్నేహను అందరూ చాలా ఇష్టపడతారు. పక్కింటి అమ్మాయిలా కనిపించే స్నేహ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తొలి వలపు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన స్నేహ ఆ తర్వాత ప్రియమైన నీకు సినిమాతో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది.
ఆ తర్వాత హీరోయిన్ గా స్నేహ వరుస సినిమాలు చేసింది. అందంతో పాటూ మంచి అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకున్న స్నేహ ఈ మధ్య సపోర్టింగ్ రోల్స్ లో కనిపిస్తోంది. మొన్నా మధ్య అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర భార్యగా కనిపించగా, ఆ తర్వాత వినయ విధేయ రామలో రామ్ చరణ్ కు వదిన పాత్రలో మెరిసింది. రీసెంట్ గా డ్రాగన్ సినిమాలో డాక్టర్ పాత్రలో కూడా స్నేహ మెరిసింది.
రీసెంట్ గా గోట్ సినిమాలో విజయ్ కు భార్యగా నటించి ఆకట్టుకున్న స్నేహ తమిళంలో చాలా మంది స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేయగా, వారందరిలో తనకు అజిత్ అంటే ఇష్టమని తెలిపింది. విజయ్, కమల్, సూర్య, అజిత్, ప్రశాంత్, ధనుష్ తో కలిసి నటించిన స్నేహకు మీ ఫేవరెట్ హీరో ఎవరనే ప్రశ్న రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఎదురవగా తనకు అజిత్ అంటే ఇష్టమని చెప్పింది. ప్రస్తుతం సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటున్న స్నేహ ఎంతో ఆచితూచి వ్యవహరిస్తుంది.
