బుల్లితెరపైకి నటి స్మృతి ఇరానీ రీఎంట్రీ
అయితే ఇప్పుడు మళ్లీ క్యూంకీ సాస్... సీరియల్ సీజన్ 2 నుంచి తులసి పాత్ర లుక్ విడుదలైంది. తులసి పాత్రలో స్మృతి ఫస్ట్ లుక్ ఇది.
By: Tupaki Desk | 7 July 2025 8:10 PM ISTబుల్లితెరతో కేంద్ర మాజీ మంత్రి, నటి స్మృతి ఇరానీ అనుబంధం ఎమోషన్‌తో కూడుకున్నది. హిట్ టీవీ సీరియల్ `క్యుంకీ సాస్ భీ కభీ బహు థి`లో తులసి విరానీ పాత్రతో ఎప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. అయితే రాజకీయాల కారణంగా స్మృతి బుల్లితెరకు గ్యాప్ ఇచ్చి అభిమానుల ఫేవరెట్ సీరియల్ నుంచి దూరంగా ఉండటంతో చాలా నిరాశపడ్డారు.
అయితే స్మృతి రాజకీయాల్లో ఉన్న సమయంలోనే తెలుగులో `జై భోలో తెలంగాణ` లాంటి విప్లవ కథా చిత్రంలో నటించేందుకు అంగీకరించడం అప్పట్లో చాలా చర్చకు తెర తీసింది. దర్శకుడు ఎన్.శంకర్ జై భోలో తెలంగాణ సినిమాలో అత్యంత కీలకమైన `తెలంగాణ తల్లి` పాత్రకు ఒప్పించేందుకు స్మృతిని చాలా అభ్యర్థించానని చెప్పారు. ఆ సినిమాలో నటించాక కూడా రాజకీయాల్లో స్మృతి ఇరానీ బిజీ అయ్యారు.
అయితే ఇప్పుడు మళ్లీ క్యూంకీ సాస్... సీరియల్ సీజన్ 2 నుంచి తులసి పాత్ర లుక్ విడుదలైంది. తులసి పాత్రలో స్మృతి ఫస్ట్ లుక్ ఇది. స్మృతి తిరిగి బుల్లితెరకు వస్తున్నారు అంటూ ప్రచారం సాగిపోతోంది. అయితే ఈ లుక్ ఫేక్ అని కొందరు, ఏఐలో సృష్టించినదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో లీక్ కాగానే, దేశవ్యాప్తంగా టీవీక్షకులు ఎమోషనల్ అయ్యారు. అప్పట్లో క్యుంకీ సాస్ భీ.. వీక్షించే రోజులకు వెళ్లారు. ఒక ఆదర్శవంతమైన కోడలు ఎలా ఉండాలో చూపించిన సీరియల్ తో స్మృతి తిరిగి నటనలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఉత్సాహం పెంచింది.
ఈ సిరీస్ ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్మృతి ఇరానీ గతంలో చాలా ఎగ్జయిట్ అవుతున్నట్టు తెలిపారు. క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ కేవలం ఒక షో కాదు. ఇది ఒక అందమైన జ్ఞాపకం. దీనిని సృష్టించిన వారికి .. స్వీకరించిన లక్షలాది మందికి ఒక నమ్మకం.. తరతరాలుగా మనల్ని బంధించే ఫాబ్రిక్ కథ అని అన్నారు. అయితే స్మృతి పై ఇప్పుడు సీజన్ 2 కి సంబంధించిన మొదటి షాట్ చిత్రీకరించారని కూడా కథనాలొచ్చాయి. మొదట జూలైలో ప్రారంభం కావాల్సిన ఈ షో నిర్మాణం కొంత ఆలస్యం అయి జూలై 4న ప్రారంభమైంది. షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఇప్పుడు జోరు పెంచారని కూడా టాక్ వినిపిస్తోంది.
