Begin typing your search above and press return to search.

కూతురుకు ల‌క్ష అద్దె చెల్లిస్తోన్న మామ్!

సినిమాల నుంచి రాజ‌కీయాల్లోకి వెళ్లి స‌క్సెస్ అయిన వాళ్లు చాలా మంది. కేంద్ర రాష్ట్ర స్థాయిలో చ‌క్రం తిప్పిన వారంతో మంది.

By:  Tupaki Desk   |   3 July 2025 6:00 PM IST
కూతురుకు ల‌క్ష అద్దె చెల్లిస్తోన్న మామ్!
X

సినిమాల నుంచి రాజ‌కీయాల్లోకి వెళ్లి స‌క్సెస్ అయిన వాళ్లు చాలా మంది. కేంద్ర రాష్ట్ర స్థాయిలో చ‌క్రం తిప్పిన వారంతో మంది. అందులో స్మృతి ఇరానీ ఒక‌రు. వ్య‌క్తిగ‌తంగా ఆమె జీవితం ఎంతో స్పూర్తిదా య‌క‌మైంది. బాల్యంలోనే జీవితాన్ని చ‌దివేసారు. జీవితమంటే పూల‌బాట కాదు..ముళ్ల బాట‌ని దాటుకుని ఎదిగిన న‌టి ఆమె. బుల్లి తెర సీరియ‌ల్స్ న‌టిగా ఎంట్రీ ఇచ్చిన స్మృతి ఇరానీ ఈ రంగంలో ఎంతో స‌క్సెస్ చూపించారు. అటుపై భార‌తీయ జ‌న‌తా పార్టీలో కీల‌క నేత‌గా ఎదిగారు.

కేంద్ర మంత్రిగాను సేవ‌లం దించారు. ఇలా రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన ముద్ర వేసారు. ఇటీవ‌లే మ‌ళ్లీ రీఎంట్రీ ఇస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. కానీ ఇంకా స్మృతి ఇరానీ దీనిపై ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. తాజాగా క‌ర‌ణ్ జోహార్ ఇంట‌ర్వ్యూలో స్మృతి ఇరానీ త‌న జీవితానికి సంబంధించి మ‌రిన్ని విష‌యాలు పంచుకున్నారు. 'మీ జీవితాన్ని ప్ర‌తిబింబించే పాట ఏద‌ని క‌ర‌ణ్ అడ‌గ‌గా...పాట కాదు కానీ 'కుచ్ కుచ్ హోతాహై' మూవీ నుంచి త‌న జీవితం `అగ్ని ప‌థ్` మూవీగా మారిపోయింద‌న్నారు.

త‌ల్లి ల‌క్ష్యాన్ని నెర‌వేర్చేందుకు కొడుకు చేసే ప్ర‌య‌త్నాల‌ను 'అగ్నిప‌థ్' లో చూపిస్తారు. అమ్మ‌కు అన్యాయం జ‌రిగింద‌నేది సినిమాలో అత‌డి ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతుంది. నా లైఫ్ లో కూడ అదే జ‌రిగింది. అమ్మ‌కు అన్యాయం జ‌రిగింది. త‌న‌ని ఏడేళ్ల వ‌య‌సులోనే ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు గెంటేసారు. ఎందుకంటే త‌ను కొడుకును క‌న‌లేద‌న్న కార‌ణంగా. దీంతో నేను అగ్నిపథ్ మూవీలాగే నా త‌ల్లికి న్యాయం చేయాల‌నుకున్నాను.

గెంటేసిన ఇంటిని అమ్మ‌కు కొని ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే అమ్మ జీవిత‌మంతా అద్దె ఇంట్టో నే బ్ర‌తికింది. ఆరేళ్ల క్రిత‌మే త‌న‌కు ఆ ఇల్లు కొనిచ్చాను. కానీ అందులో త‌న‌కు ఉచితంగా ఉండటం ఇష్టం లేక ల‌క్ష అద్దె చెల్లిస్తుంది త‌ను సంపాదించిన డ‌బ్బుతోనే. క‌ష్టం తెలిసిన మ‌నుషులం మేమంతా. చిన్న‌ప్ప‌టి నుంచి క‌ష్టంలోనే పెరిగాం. ఇప్ప‌టికీ అలా ప‌నిచేయ‌డం అంటే ఎంతో ఆస‌క్తిగా ` అని తెలిపారు.