Begin typing your search above and press return to search.

తుల‌సీ విరానీగా మ‌ళ్లీ కేంద్ర మాజీ మంత్రా?

సినిమాల నుంచి రాజ‌కీయాల్లోకి వెళ్లి స‌క్సెస్ అయిన వాళ్లు చాలా మంది. కేంద్ర రాష్ట్ర స్థాయిలో చ‌క్రం తిప్పిన వారంతో మంది.

By:  Tupaki Desk   |   12 Jun 2025 2:00 AM IST
తుల‌సీ విరానీగా మ‌ళ్లీ కేంద్ర మాజీ మంత్రా?
X

సినిమాల నుంచి రాజ‌కీయాల్లోకి వెళ్లి స‌క్సెస్ అయిన వాళ్లు చాలా మంది. కేంద్ర రాష్ట్ర స్థాయిలో చ‌క్రం తిప్పిన వారంతో మంది. అందులో స్మృతి ఇరానీ ఒక‌రు. వ్య‌క్తిగ‌తంగా ఆమె జీవితం ఎంతో స్పూర్తిదా య‌క‌మైంది. జీవితమంటే పూల‌బాట కాదు...ముళ్ల బాట‌ని దాటుకుని ఎదిగిన న‌టి ఆమె. బుల్లి తెర సీరియ‌ల్స్ న‌టిగా ఎంట్రీ ఇచ్చిన స్మృతి ఇరానీ ఈ రంగంలో ఎంతో స‌క్సెస్ చూపించారు. అటుపై భార‌తీయ జ‌న‌తా పార్టీలో కీల‌క నేత‌గా ఎదిగారు. కేంద్ర మంత్రిగాను సేవ‌లందించారు.

రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన ముద్ర వేసారు. స‌క్సెస్ అనంత‌రం అమె మ్యాక‌ప్ కు దూర‌మ‌య్యారు. అయితే తాజాగా స్మృతి ఇరానీ మ‌ళ్లీ కంబ్యాక్ అవుతున్నట్లు స‌మాచారం. గ‌తంలో స్మృతి ఇరానీ న‌టించిన `క్యుంకీ సాస్ బీ క‌భీ హూ తూ` సీరియ‌ల్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో తుల‌సీ విరానీ పాత్ర‌లో ఇరానీ అభిన‌యించారు. ఆ పాత్ర‌కు మంచి పేరొచ్చింది అప్ప‌ట్లో. తాజాగా ఈ సీరియ‌ల్ కు సీక్వెల్ ప్లానింగ్ జ‌రుగుతోంది.

అప్ప‌ట్లో ఆ సీరియ‌ల్ 150 ఎపిసోడ్లు ప్ర‌సార‌మైంది. అక్క‌డ నుంచి కొన‌సాగింపుగా సీక్వెల్ ప్లాన్ చేస్తు న్నారు. దీనిలో భాగంగా కొన్ని కీల‌క‌మైన పాత్ర‌ల‌కు మొద‌టి భాగంలో న‌టించిన వారినే తీసుకునే ప్ర‌క్రియ కొన‌సాగుతుంది. ఈ నేప‌థ్యంలో నిర్మాత ఏక్తాక‌పూర్ స్మృతి ఇరానీ సంప్ర‌దించ‌గా పాజిటివ్ గా స్పందిం చారుట‌. ఇద్ద‌రి మ‌ధ్య అగ్రిమెంట్ కూడా పూర్త‌యింద‌ని స‌మాచారం.

ఇటీవ‌లే స్మృతి ఇరానీ ఇదే సీరియ‌ల్ లో మిహిర్ విరానీ పాత్ర పోషించిన అమ‌ర్ ఉపాద్యాయ్ తో పాటు ఏక్తాక‌పూర్ పుట్టిన రోజు వేడుక‌ల్లో త‌ళుక్కున మెరిసారు. రాజ‌కీయ ప్ర‌సాంగాల్లో క‌నిపించే స్మృతి ఇరానీ పార్టీ వేడుక‌ల్లో క‌నిపించే స‌హ‌న‌టులంతా స‌ర్ ప్రైజ్ అయ్యారు. అప్ప‌టి నుంచే స్మృతి మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారా? అనే ప్ర‌చారం మొద‌లైంది. అనుకున్న‌ట్లుగానే అదే జ‌రుగుతోంది.