Begin typing your search above and press return to search.

యానిమాల్ లో ఆ చిన్న సీన్ ఎక్కువైందట

అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా సిద్ధమైన యానిమల్ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

By:  Tupaki Desk   |   1 Dec 2023 3:40 AM GMT
యానిమాల్ లో ఆ చిన్న సీన్ ఎక్కువైందట
X

నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన హాయ్ నాన్న మూవీ డిసెంబర్ 7 థియేటర్స్ లోకి వస్తోంది. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా సిద్ధమైన యానిమల్ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. నాని, సందీప్ రెడ్డి ఇద్దరు తమ సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా ఒకరిని ఒకరు ఇంటర్వ్యూ చేసుకున్నారు.

ఈ సందర్భంగా తన సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకోవడం విశేషం. యానిమల్ సినిమా రన్ టైం గురించి సందీప్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మూడు గంటల నిడివి ఉన్న సినిమాలో ట్రిమ్ చేయడానికి నాకు ఒక 25 సెకండ్లు మాత్రమే కనిపించిందని చెప్పుకొచ్చారు. సినిమాలో ప్రతి సీన్ కూడా చాలా కీలకంగా, భావోద్వేగాలను టచ్ చేసే విధంగా ఉంటుందని అన్నారు.

రన్ టైం ఎక్కువ ఉన్నా కూడా సినిమాలో ఎమోషన్ ప్రేక్షకులకు రీచ్ అవుతుందని సందీప్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇక హాయ్ నాన్న సినిమాలో హీరో కథని తన కూతురికి నేరేట్ చేయడంపై నాని స్పష్టత ఇచ్చారు. రియల్ గా జరిగిన సంఘటన అయితే కూతురుతో పంచుకోవడం తండ్రికి ఈజీ అయిపోతుంది. తండ్రి కూతుర్ల భావోద్వేగాలను చెప్పడానికి వారందరూ ఎమోషన్ క్యారీ అవుతుందని, సినిమాలో ఈ అంశం చాలా కీలకంగా ఉండబోతుందని తెలియజేశారు.

ఇలా యానిమల్ దర్శకుడు సందీప్, హాయ్ నాన్న హీరో తమ సినిమాలకు సంబంధించిన లోతులను టచ్ చేస్తే ఇంటర్వ్యూలో మాట్లాడుకోవడం ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఈ తరహా ఇంటర్వ్యూలు ఎక్కువగా వస్తున్నాయి. దసరా, రావణాసుర రిలీజ్ టైం లో నాచురల్ స్టార్ నాని, మాస్ మహారాజ్ రవితేజ ఒకరిని ఒకరు ఎంటరు చేసుకుని తమ సినిమాలను ప్రమోట్ చేశారు.

ఈ కొత్త తరహా ప్రమోషన్ కాన్సెప్ట్ పెద్ద సినిమాలకు కూడా ఒక బూస్టింగ్ అవుతుంది. సెలబ్రిటీలు ఒకరితో ఒకరు చిట్ చాట్ చేయడం ఫాన్స్ కూడా ఆస్వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే ట్రైలర్ తోనే యానిమల్ సినిమా ప్రశంసలు సొంతం చేసుకుంది. మరి సందీప్ రెడ్డి ఆ ఇంటెన్షన్ ని క్యారీ చేస్తూ సినిమాతో ప్రేక్షకులను ఏ మేరకు ఎంగేజ్ చేస్తారు అనేది చూడాలి.