Begin typing your search above and press return to search.

సీక్వెల్స్‌తో పెరుగుతున్న బడ్జెట్ అంచనాలు!

ప్రస్తుతం సీక్వెల్స్ .. ఫ్రాంచైజీల హవా నడుస్తోంది. గతంలో చిన్న సినిమా విజయం సాధిస్తే దానికి కొనసాగింపుగా వచ్చే సినిమాలను సాధారణంగానే క‌నిపించేవి.

By:  Srikanth Kontham   |   15 July 2026 2:00 PM IST
సీక్వెల్స్‌తో పెరుగుతున్న బడ్జెట్ అంచనాలు!
X

ప్రస్తుతం సీక్వెల్స్ .. ఫ్రాంచైజీల హవా నడుస్తోంది. గతంలో చిన్న సినిమా విజయం సాధిస్తే దానికి కొనసాగింపుగా వచ్చే సినిమాలను సాధారణంగానే క‌నిపించేవి. కానీ `బాహుబలి` లాంటి భారీ చిత్రాలు సృష్టించిన సంచలనం తర్వాత మేకర్స్ ఆలోచనా దృక్పథం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు చిన్న బడ్జెట్‌తో మొదలై సంచలనం సృష్టించిన సినిమాలు సైతం సీక్వెల్స్ రూపంలో వందల కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్నాయి. ఈ ధోరణికి ప్రధాన కారణం ప్రేక్షకులలో పెరిగిన అంచనాలు ..కథాంశాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే నిర్మాతల తపన.

ఎంతో వినూత్నంగా తెరకెక్కిన `తుంబాడ్` మొదటి భాగం 10 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. కానీ ఇప్పుడు రాబోతున్న 'తుంబాడ్ 2' కోసం మేకర్స్ ఏకంగా 150 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే ఒకప్పుడు ప్రయోగాత్మకంగా మొదలైన చిత్రాలు ఇప్పుడు భారీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో కూడిన విజువల్ వండర్స్‌గా మారుతున్న వైనం క‌నిపిస్తోంది.

'కాంతార' వంటి చిత్రం కన్నడ నాటనే కాకుండా దేశవ్యాప్తంగా ఎలా ప్రభావితం చేసిందో తెలిసిందే. 16 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన `కాంతార` బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీని ప్రీక్వెల్‌గా 'కాంతార: చాప్టర్ 1 కోసం 150 కోట్లు ఖ‌ర్చు చేసారు.

తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 'గూఢచారి' చిత్రం 6 కోట్ల బడ్జెట్‌తో మొదలై స్పై థ్రిల్లర్‌గా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు దాని సీక్వెల్ `గూఢచారి 2`ను అంతర్జాతీయ ప్రమాణాలతో సుమారు 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తక్కువ బడ్జెట్ సినిమాల స్థాయిని ఇలా వందల కోట్ల ప్రాజెక్టులుగా మార్చడం అనేది టాలీవుడ్ స్థాయిని విశ్వవ్యాప్తం చేయడంలో ఓ భాగంగా ప‌రిగ‌ణించొచ్చు. అలాగే భక్తి, పౌరాణిక ఇతివృత్తాలతో వచ్చిన `హనుమాన్` వంటి చిత్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు దీని కొనసాగింపుగా రాబోతున్న 'జై హనుమాన్ ' ను 100 కోట్ల బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఇది చిన్న బడ్జెట్ సినిమాలపై ప్రేక్షకులకు ఉన్న నమ్మకాన్ని, నిర్మాతల ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇలా భారీ బడ్జెట్‌ను కేటాయిం చడం అన్న‌ది మేకర్స్ ఎంతటి రిస్క్ తీసుకుంటున్నారో తెలియజేస్తుంది. ఇలాంటి భారీ పెట్టుబడులు, చిత్ర నిర్మాణంలో సాంకేతికత , కథా విస్తరణకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో? స్పష్టం చేస్తున్నాయి. చివ‌రిగా సీక్వెల్స్ కోసం వెచ్చిస్తున్న భారీ మొత్తాలు సినిమా మేకింగ్‌లో వ‌స్తోన్న మార్పులను సూచిస్తున్నాయి. కథ ఎంత బలమైనదైనా? దానికి తగిన విజువల్స్ ..ప్రొడక్షన్ విలువలను తోడు చేస్తే ప్రేక్షకులు ఏ స్థాయికైనా ఆదరిస్తారని మేకర్స్ భావిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ ప్రయాణం, భారతీయ సినిమాలను గ్లోబల్ మార్కెట్‌లో నిలబెట్టే దిశగా సాగుతోందని చెప్పొచ్చు.