Begin typing your search above and press return to search.

స్లమ్ డాగ్ హస్బెండ్ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే..

తాజాగా మూవీ విడుదలను వాయిదా వేశారు. కొత్త తేదీని ప్రకటించారు.

By:  Tupaki Desk   |   16 July 2023 9:47 AM GMT
స్లమ్ డాగ్ హస్బెండ్ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే..
X

నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు హీరోగా, ప్రణవి మానుకొండ హీరోయిన్‌‌గా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇటీవల టీజర్, ట్రైలర్ విడుదల చేయగా, విపరీతంగా ఆకట్టుకుంది.

కాగా, ఈ మూవీ ప్రస్తుతం విడుదలకు సిద్ధమైంది. మొదట ఈ మూవీని జులై 21వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, తాజాగా మూవీ విడుదలను వాయిదా వేశారు. కొత్త తేదీని ప్రకటించారు. ఈ మూవీని ఈ నెల 29వ తేదీన న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ సినిమాకి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫుల్ కామెడీ మూవీగా ఇది సాగనుంది.

ట్రైలర్ చూసిన వారికి ఇప్పటికే మూవీ కథ అర్థమై ఉంటుంది. హీరో హీరోయిన్లు విపరీతంగా ప్రేమించుకుంటారు. వారి పెళ్లికి కష్టపడి పెద్దలను ఒప్పిస్తారు. తీరా వారు పెళ్లికి అంగీకరించే సమయానికి హీరో జాతకంలో దోషం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో, వారు ఆ దోషం పోవడానికి కుక్కతో పెళ్లి చేస్తారు. ఇక్కడే స్టోరీ టర్న్ తిరుగుతుంది. దోషం పోయింది కదా అని మళ్లీ హీరోయిన్ ని పెళ్లి చేసుకునే సమయానికి కుక్క కోర్టుకి ఎక్కుతుంది.

కుక్క కోర్టుకి ఎక్కి న్యాయం కోసం పోరాడటంతో కథ ఫన్నీ టర్న్ తీసుకుంటుంది. మరి చివరకు ఏమైంది.తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో లేదో తెలియాలంటే మూవీ విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే. కాగా, ఈ మూవీలో బ్రహ్మాజీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తన కొడుకు మొదటి సినిమా పిట్ట కథలోనూ బ్రహ్మాజీ పోలీసు అధికారిగా నటించగా, ఇందులో లాయర్ పాత్ర పోషించడం విశేషం.

మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించిన సంజయ్ రావు, ఈ సినిమాతో అయినా హీరో గా క్లిక్ అవుతాడో లేదో చూడాలి. ఇక, ప్రణవి మానుకొండకి హీరోయిన్ గా ఇది మొదటి సినిమా. గతంలో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి, ఇప్పుడు ఈ సినిమాతో హీరోయిన్ గా మారారు. మరి ఈ మూవీ ఆమె కెరీర్ కి ఎంతలా ఉపయోగపడుతుందో చూడాలి.