Begin typing your search above and press return to search.

'బేబీ' డబ్బులతో మరో నాలుగు...!

సాయి రాజేష్ తో పాటు ఆ ఫోటోలో సందీప్ రాజ్, రవి నంబూరి, సుమన్ పాతూరి లు ఉన్నారు. ప్రస్తుతం వీరు స్క్రిప్ట్‌ వర్క్ లో ఉన్నారు.

By:  Tupaki Desk   |   13 Oct 2023 7:31 AM GMT
బేబీ డబ్బులతో మరో నాలుగు...!
X

అల్లు అర్జున్‌ కి వ్యక్తిగత పీఆర్‌ గా, గీతా ఆర్ట్స్ బ్యానర్‌ కి పీఆర్ గా సుదీర్ఘ కాలం పాటు చేసి, మెగా ఫ్యామిలీకి సన్నిహితుడిగా పేరు దక్కించుకున్న ఎస్‌కేఎన్‌ ఇప్పుడు నిర్మాతగా వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. ఎస్‌కేఎన్‌ సినిమాల నిర్మాణం మొదలు పెట్టి చాలా కాలం అయినా కూడా ఆశించిన స్థాయిలో విజయాలను సొంతం చేసుకోలేక పోవడం తో మెల్లగా సినిమాల నిర్మాణం చేస్తూ వస్తున్నాడు.

ఇటీవల నిర్మించిన బేబీ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఏకంగా వంద కోట్ల వసూళ్లు సాధించడంతో నిర్మాత ఎన్‌కేఎన్‌ వరుస సినిమాల నిర్మాణంకు ప్లాన్‌ చేస్తున్నాడు. బేబీ సినిమా విజయంతో భారీ సినిమాల నిర్మాణం వైపు వెళ్లకుండా మళ్లీ కూడా చిన్న సినిమాలనే మంచి కాన్సెప్ట్‌ లతో నిర్మించేందుకు కథలను మరియు దర్శకులను సిద్ధం చేసుకున్నాడు.

ఇప్పటికే బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ తో ఎన్‌కేఎన్ సినిమా కన్ఫర్మ్‌ అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఆ సినిమా షూటింగ్‌ ఏ సమయంలో అయినా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తాజాగా తాను నిర్మించబోతున్న సినిమాల దర్శకులతో ఎన్‌కేఎన్‌ ఫోటోకు ఫోజ్ ఇచ్చి... వీళ్లే నా దర్శకులు అన్నట్లుగా ఇన్‌ స్టా లో షేర్ చేశాడు.

సాయి రాజేష్ తో పాటు ఆ ఫోటోలో సందీప్ రాజ్, రవి నంబూరి, సుమన్ పాతూరి లు ఉన్నారు. ప్రస్తుతం వీరు స్క్రిప్ట్‌ వర్క్ లో ఉన్నారు. త్వరలోనే సినిమాలు ప్రారంభం అవ్వబోతున్నాయి. అన్ని కూడా లో బడ్జెట్‌ లేదా మీడియం రేంజ్ బడ్జెట్‌ సినిమాలే అయ్యి ఉంటాయి. కనుక మినిమం ప్రాఫిట్స్ ఖాయం. బేబీ సినిమా తో వచ్చిన లాభం డబ్బుతో ఈ నాలుగు సినిమాలను చేయబోతున్న ఎన్‌కేఎన్‌... ఈ సినిమాలు విజయం సాధిస్తే స్టార్‌ హీరోల డేట్ల కోసం ప్రయత్నాలు చేస్తాడేమో చూడాలి.