Begin typing your search above and press return to search.

నవ్వులపాలు చేస్తున్న నిర్మాత లాజిక్..!

సోషల్ మీడియాలో ఒక వర్గం ట్రాప్ లో పడి ఫ్యాన్స్ దాన్ని డిజాస్టర్ చేసుకున్నారని ఆయన అన్నారు.

By:  Tupaki Desk   |   23 Aug 2023 7:33 AM GMT
నవ్వులపాలు చేస్తున్న నిర్మాత లాజిక్..!
X

మెగాస్టార్ చిరంజీవి మీద తన అభిమానం ఎంత అన్నది మైక్ పట్టుకున్న ప్రతిసారి చెబుతూనే వస్తున్నాడు నిర్మాత ఎస్.కె.ఎన్. తను చదువుకునే రోజుల్లో మెగా వీరాభిమానిగా చాలా యాక్టివ్ గా ఉండటం వల్లే అతన్ని అల్లు శిరీష్ పిలిపించి అల్లు అర్జున్ కి పరిచయం చేయడం ఆ టైం లో అతను ఎన్నో కష్టాలు పడి అక్కడ ఇక్కడ జాబ్ చేసి, హీరోలకు పి.ఆర్ గా ఉండి ఫైనల్ గా నిర్మాతగా మారాడు. రీసెంట్ గా బేబీ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఎస్.కె.ఎన్ తానొక సక్సెస్ ఫుల్ నిర్మాతగా కన్నా ఇప్పటికీ మెగా అభిమానిగానే కనిపిస్తుంటాడు.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా జరిగిన ఈవెంట్ లో మరోసారి చిరు మీద తనకు ఉన్న ప్రేమను చూపించాడు ఎస్.కె.ఎన్. మామూలుగానే తన పంచులతో ఆడియన్స్ ని అలరిస్తాడని పేరు తెచ్చుకున్న ఎస్.కె.ఎన్ ఈ మెగా ఈవెంట్ లో మరోసారి అదే రేంజ్ స్పీచ్ ఇచ్చాడు. అయితే అదే క్రమంలో భోళా శంకర్ గురించి ఎస్.కె.ఎన్ చెప్పిన లాజిక్ మాత్రం నవ్వులపాలు అయ్యేలా చేస్తుంది. అభిమాన హీరో ఏం చేసినా వీరాభిమానులకు నచ్చుతుంది.. కానీ నచ్చాల్సింది కేవలం అభిమానులకే కాదు సగటు ప్రేక్షకుడికి కూడా.

భోళా శంకర్ లో బాస్ మునుపెన్నడూ లేనంత అందంగా ఉన్నారని ఎస్.కె.ఎన్ అన్నారు. సోషల్ మీడియాలో ఒక వర్గం ట్రాప్ లో పడి ఫ్యాన్స్ దాన్ని డిజాస్టర్ చేసుకున్నారని ఆయన అన్నారు. ఈ స్టేట్మెంట్ మీద మెగా ఫ్యాన్స్ కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నారు. కేవలం కాస్టూమ్స్ బాగున్నాయని స్టార్ సినిమా హిట్ చేసే సీన్ అసలు ఎప్పుడూ లేదు. అంతేకాదు కేవలం ఫ్యాన్స్ బాగుందని ఎంత చెప్పినా కామన్ ఆడియన్ రిపోర్ట్ మీదే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది.

అలా కాకుండా కేవలం హీరో డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది.. లుక్ బాగుంది అనుకుని హిట్ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. చిరు స్వాగ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయనకు ఒక సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల పెద్దగా పోయేది ఏమి లేదు బ్లాక్ బస్టర్ పడటం వల్ల వచ్చేది ఏమి లేదు. కానీ అభిమానులు ముందు నుంచి ఈ సినిమాపై నెగిటివిటీ ఏర్పరచుకున్న మాట వాస్తవమే కానీ.. సినిమాలో మ్యాటర్ ఉంటే ఆ ఫ్యాన్సే సినిమా హిట్ లో తమ వంతు కృషి చేస్తారు. ఎస్.కె.ఎన్ ఈ లాజిక్ మిస్ అయితే ఎలా అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.