Begin typing your search above and press return to search.

రాజాసాబ్‌ లీక్‌.. అసలు విషయం ఏంటంటే!

దాంతో అది రాజాసాబ్‌ సినిమాకు సంబంధించిన స్టిల్‌ అని, మారుతి లీక్ పై సీరియస్ అయ్యాడు అంటూ మీడియా వర్గాల్లో ప్రచారం జరిగింది.

By:  Tupaki Desk   |   8 Feb 2024 9:41 AM GMT
రాజాసాబ్‌ లీక్‌.. అసలు విషయం ఏంటంటే!
X

సలార్ సినిమాతో సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకున్న ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో కల్కి తో పాటు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కూడా ప్రభాస్ అభిమానుల్లో విపరీతమైన అంచనాలు, ఆసక్తి పెంచాయి.

ఇటీవల ప్రభాస్ యాక్షన్‌ మూడ్‌ లో ఉన్న ఒక స్టిల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దాంతో అది రాజాసాబ్‌ సినిమాకు సంబంధించిన స్టిల్‌ అని, మారుతి లీక్ పై సీరియస్ అయ్యాడు అంటూ మీడియా వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే రాజా సాబ్ లీక్ విషయమై మారుతి సన్నిహితుడు ఎస్‌కేఎన్‌ స్పందించాడు.

ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ.. అందరు అనుకుంటున్నట్లుగా అది రాజా సాబ్‌ లోనిది కాదు. రాజాసాబ్ యాక్షన్‌ సన్నివేశాలకు సంబంధించిన పిక్ ఏది కూడా లీక్ అవ్వలేదు. ఫ్యాన్స్ అనవరస ప్రచారం మరియు పుకార్లను నమ్మవద్దు అంటూ ఆయన పేర్కొన్నాడు.

రాజాసాబ్ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ను 300 కోట్ల బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా ను ఇదే ఏడాదిలో విడుదల చేస్తారా లేదంటే వచ్చే ఏడాదిలో విడుదల చేస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.