Begin typing your search above and press return to search.

15వ ఏట నుంచే ఆ స్టార్ హీరో డాట‌ర్ విదేశాల్లో!

న్యూయార్క్ లో మిగిలిన చ‌దువుల‌న్నింటిని పూర్తిచేసింది. అయితే ఇలా 15 ఏళ్లకే త‌ల్లిదండ్రుల్ని వ‌దిలి విదేశాల్లో ఉండ‌టం ప‌ట్ల సుహానా భ‌యాన్ని వ్య‌క్తం చేసింది.

By:  Tupaki Desk   |   17 Aug 2023 3:30 PM GMT
15వ ఏట నుంచే ఆ స్టార్ హీరో డాట‌ర్ విదేశాల్లో!
X

షారుక్ ఖాన్ -గౌరీఖాన్ ల ముద్దుల కుమార్తె సుహానాఖాన్ గురించి ప‌రిచ‌య‌మవ‌స‌రం లేదు. సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు యాక్టివ్ గా క‌నిపిస్తుంది. మ్యాక‌ప్ వేసుకోవ‌డానికి ముందే షారుక్ డాట‌ర్ గా బోలెడంత ఫేమ‌స్. ప్రెండ్స్ గ్యాంగ్ తో అమ్మ‌డు ప‌బ్ ల్లో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఇప్పుడామె వ‌య‌సు 23 ఏళ్లు. 'ది అర్చీస్' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా కేవ‌లం ఓ ఓక్స్ పీరియ‌న్స్ కోసం చేస్తోంది. ఇదే సినిమాతో చాలా మంది స్టార్స్ కిడ్స్ ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. అలా సుహానా ని కూడా షారుక్ లాంచ్ చేస్తున్నారు.

ఆ త‌ర్వాత షారుక్ ప్లాన్ ప్ర‌కారం బాలీవుడ్ లో చక్రం తిప్ప‌నుంది. జాన్వీ క‌పూర్..సారా అలీఖాన్ లాంటి భామ‌ల‌కు పోటీగా డాట‌ర్ ని షారుక్ దించ‌బోతున్నాడు. అందుకు అత‌డి వ‌ద్ద ప్ర‌త్యేక‌మైన ప్లాన్ ఉంది. ఆ ర‌కంగా సుహానా ఖాన్ ఎంట్రీ పై ఓ క్లారిటీ ఉంది. అయితే 23 ఏళ్ల సుహానా ముంబైలో ఉంది చాలా త‌క్కువ కాల‌మ‌నే తెలుస్తోంది. స్కూలింగ్ కొన్ని క్లాసులు ముంబైలో పూర్తి చేసి అటుపై పై చ‌దువుల కోసం విదేశాలు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. సుహానికి 15వ ఏళ్లు వ‌చ్చే స‌రికి త‌ల్లిదండ్రులు ఆమెని విదేశాలు పంపిచిన‌ట్లు తెలుస్తోంది.

యూకే..న్యూయార్క్ లో మిగిలిన చ‌దువుల‌న్నింటిని పూర్తిచేసింది. అయితే ఇలా 15 ఏళ్లకే త‌ల్లిదండ్రుల్ని వ‌దిలి విదేశాల్లో ఉండ‌టం ప‌ట్ల సుహానా భ‌యాన్ని వ్య‌క్తం చేసింది. ఇది ఎంతో భ‌యాన‌క‌మైన అనుభూత‌ని.. షాకింగ్ గానూ అనిపించ‌ద‌ని ఆ నాటి జ్ఞాప‌కాలు గుర్తు చేసుకుంది. విదేశాల్లో స్కూల్ డేస్ ..అక్క‌డ ఉంటే సంస్కృతి ఆరంభంలో ఎంతో కొత్త‌గా ఉండేద‌ని...ఒంట‌రిగా ఫీలైన‌ట్లు తెలిపింది.

ఆ వ‌య‌సులో ఎలా మెల‌గాలో తెలియ‌లేద‌ని.. అక్క‌డి వాతావ‌ర‌ణం..చుట్టూ ఉన్న వారు కొత్తగా ఉండ‌టంతో ఓ ర‌క‌మైన ఆందోళ‌న‌కు గురైన‌ట్లు చెప్పుకొచ్చింది. ఆర‌కంగా చూస్తూ ఊహ తెలిసిన ప‌దేళ్ల త‌ర్వాత సుహానా జీవిత‌మంతా విదేశాల్లోనే సాగిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇప్పుడు హీరోయిన్ గా అయ్యే అవ‌కాశం ముందుడ‌టంతో ముంబైకి తిరిగొచ్చిన‌ట్లు తెలుస్తోంది.