Begin typing your search above and press return to search.

బేబీ రీమేక్.. మేకర్స్ కొత్త వ్యూహమా?

అయితే ఆ ప్రాజెక్ట్‌పై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాకపోవడంతో, ఆ రీమేక్ నిజంగా పట్టాలెక్కిందా? లేదా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   18 July 2026 6:31 PM IST
బేబీ రీమేక్.. మేకర్స్ కొత్త వ్యూహమా?
X

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా, సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ తెలుగు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, బలమైన కంటెంట్‌తో ఊహించని స్థాయిలో వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఆ స‌క్సెస్‌తోనే ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయాలనే డెసిష‌న్ తీసుకున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్‌పై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాకపోవడంతో, ఆ రీమేక్ నిజంగా పట్టాలెక్కిందా? లేదా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.

కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం మాత్రం పూర్తి భిన్నమైన విష‌యాన్ని చూపిస్తోంది. ఆశ్చర్యకరంగా, బాలీవుడ్ బేబీ రీమేక్ షూటింగ్ ఇప్పటికే సుమారు 50% పూర్తయినట్లు నిర్మాత ఎస్‌కేఎన్ తెలిపారు. అంతేకాదు, సినిమాలోని మెయిన్ క్యాస్టింగ్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ కు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ను ఆగస్టు లేదా సెప్టెంబర్ 2026లో గ్రాండ్‌గా అనౌన్స్ చేయ‌నున్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు.

సాధారణంగా బాలీవుడ్‌లో ఒక సినిమా మొదలయ్యే ముందే టైటిల్ అనౌన్స్‌మెంట్, ఫస్ట్ లుక్, కాస్ట్ రివీల్ వంటి అప్డేట్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడం ఆనవాయితీ. కానీ బేబీ రీమేక్ విషయంలో మేకర్స్ పూర్తిగా భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ముందుగా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసి, ఆ తర్వాత ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను స్టార్ట్ చేసేలా ప్లాన్‌తో వారు ముందుకు వెళ్తున్నారనే డిస్క‌ష‌న్ జరుగుతోంది.

ఇలాంటి స్ట్రాట‌జీ వెనుక కూడా బలమైన కారణాలే ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ముందుగానే భారీ ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేస్తే అంచనాలు అనవసరంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే షూటింగ్‌లో లేటైనా నెగిటివ్ ప్ర‌మోష‌న్ అయ్యే ప్ర‌మాద‌ముంటుంది. అందుకే ముందుగా కీలక భాగం షూటింగ్ పూర్తి చేసి, తర్వాత వరుస అప్డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావడం ద్వారా ప్రమోషన్‌ను మరింత ఎఫెక్టివ్ గా మార్చాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఒరిజినల్ బేబీకి యూత్‌లో ఏర్పడిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, హిందీ వెర్షన్‌ను కూడా అదే స్థాయిలో మార్కెట్ చేయాలనే టార్గెట్ తో టీమ్ పనిచేస్తోందని సమాచారం. ముఖ్యంగా కాస్ట్, మ్యూజిక్, ఫస్ట్ లుక్‌ను ఒకేసారి అనౌన్స్ చేయ‌డం ద్వారా సోషల్ మీడియాలో భారీ బజ్ క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మార్కెటింగ్ ప్లాన్ బాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీయడం ఖాయంగా కనిపిస్తోంది.