హీరోయిన్ బాత్రూం యాక్సెస్ గురించి నిర్మాత కామెంట్స్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..!
ఈ ఇంటర్వ్యూలో భాగంగా కెతిక శర్మతో S.K.N మాట్లాడుతూ ప్రభాస్ తో ఒక సందర్భంలో మీరు బాత్ రూమ్ సింగర్ అని చెప్పారు.
By: Tupaki Desk | 15 May 2025 11:14 PM ISTకొన్నిసార్లు కొన్ని మాటలు సరదాగా అన్నా సరే అవి బయటకు వచ్చే సరికి చాలా అర్ధాలు నానార్ధాలు వచ్చేలా చేస్తాయి. తీరా అన్న వ్యక్తి కూడా ఏంటి నేనన్న మాటలో ఇంత అర్ధం ఉందా అనేలా అవాక్కయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే ఏదైనా మాట్లాడే ముందు కాత ఆచి తూచి మాట్లాడాలని అంటుంటారు. ఐతే మైక్ పెట్టుకుని కెమెరా ఆన్ చేయగానే తెలియకుండానే కొన్ని మాటలు అలా ఫ్లోలో వచ్చేస్తాయి. ఐతే అవి కట్ అని చెప్పేలోగా సోషల్ మీడియాలోకి వెళ్లడం నానా హంగామా జరగడం చూస్తుంటాం.
ప్రస్తుతం అలాంటి ఒక సందర్భమే ప్రముఖ నిర్మాత S.K.N కి వచ్చింది. శ్రీవిష్ణు లీడ్ రోల్ లో తెరకెక్కిన సింగిల్ సినిమా ఆల్రెడీ లాస్ట్ వీక్ రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఐతే సినిమాను ఇంకాస్త ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా నిర్మాత S.K.N తో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ స్పెషల్ చిట్ చాట్ అంతా కూడా చాలా ఫన్నీగా సాగింది. ఐతే ఈ ఇంటర్వ్యూలో S.K.N కెతికను అన్న ఒక మాట సోషల్ మీడియాలో అతన్ని టార్గెట్ అయ్యేలా చేసింది.
ఇంతకీ అసలు ఏం జరిగింది అంటే సింగిల్ టీం అంటే హీరో శ్రీ విష్ణు, వెన్నెల కిశోర్ హీరోయిన్స్ ఇవానా, కెతిక శర్మల తో నిర్మాత ఎస్.కె.ఎన్ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా కెతిక శర్మతో S.K.N మాట్లాడుతూ ప్రభాస్ తో ఒక సందర్భంలో మీరు బాత్ రూమ్ సింగర్ అని చెప్పారు. మీ బాత్ రూమ్ కి మాకు ఎలాగు యాక్సెస్ ఉండదు కాబట్టి మీరు ఇక్కడ పాడుతారా అని ఏదో ఫ్లోలో అనేశాడు.
S.K.N అది కావాలని అన్నాడా లేదా అన్నది పక్కన పెడితే అలా ఒక హీరోయిన్ ని మీ బాత్ రూమ్ యాక్సెస్ మాకు లేదు కాబట్టి అనడం మాత్రం కరెక్ట్ కాదు. అక్కడే నెటిజన్లు S.K.N ని ఆడుకుంటున్నారు. అసలు హీరోయిన్స్ గురించి అది కూడా బాత్ రూం యాక్సెస్ అంటూ మాట్లాడటం ఏంటంటూ ఫైర్ అవుతున్నారు. నిజంగా అక్కడ ఎస్.కె.ఎన్ ఉద్దేశం ఏంటో అందరికీ అర్ధం అవుతున్నా ఇలా ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ బాత్రూం యాక్సెస్ గురించి ప్రస్తావించడం ఏంటంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఐతే వ్యవహారం కాస్త బాగానే వేడి మీద ఉంది కాబట్టి ఎస్.కె.ఎన్ దీనిపై స్పందిస్తారా లేదా లైట్ తీసుకుంటారా అన్నది చూడాలి.
