Begin typing your search above and press return to search.

ఇప్పుడే ఇలా ఉంటే.. డంకీ ఏ రేంజ్ లో ఉంటుందో

అయితే నిజానికి పఠాన్, జవాన్ సినిమాల కథ విషయానికొస్తే.. అవి రొటీన్ కమర్షియల్ స్టోరీసే అని అర్థమవుతుంది

By:  Tupaki Desk   |   9 Sep 2023 8:25 AM GMT
ఇప్పుడే ఇలా ఉంటే.. డంకీ ఏ రేంజ్ లో ఉంటుందో
X

కొంతకాలం క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీ సరైన హిట్ లేక, కనీసం రూ.100కోట్లు కూడా అందుకోలేక సతమతమవుతుంటే.. మన సౌత్ ఇండస్ట్రీలు మాత్రం పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్స్ అందుకుంటూ రూ.1000 కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకున్నాయి. అలాంటి తరుణంలో వరుస ఫ్లాప్ లతో ఉన్న షారుక్.. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో వచ్చి రూ. 1000 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. తాను బాలీవుడ్ బాద్ షా అన్న మాటను నిరూపించాడు.

మళ్లీ మరోసారి సెప్టెంబర్ 7న జవాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో భారీ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఈ సినిమా వసూళ్లు చూస్తుంటే.. ఈ చిత్రం కూడా లాంగ్ రన్ టైమ్ లో వెయ్యి కోట్లు పక్కా అని అంచనాలు వేస్తున్నారు ట్రేడ్ వర్గాల పండితులు. అయితే ఇక షారుక్ చేతిలో ఇంకా మరో సినిమా మాత్రమే ఉంది. అదే డంకీ. దీంతో ఇక ఈ సినిమా కూడా ఎలా ఉండబోతుందా అన్న ఆసక్తి అప్పుడే మొదలైపోయింది అభిమానుల్లో.

అయితే నిజానికి పఠాన్, జవాన్ సినిమాల కథ విషయానికొస్తే.. అవి రొటీన్ కమర్షియల్ స్టోరీసే అని అర్థమవుతుంది. కానీ ఆ చిత్రాలకు మంచి యాక్షన్ సీక్వెన్స్ లాంటి మసాలాను దట్టించి.. మాస్ అండ్ యాక్షన్ ప్రియులకు కావాల్సినంత విందును ఇచ్చాడు షారుక్. మంచి భారీ యాక్షన్ విజువల్ ట్రీట్ ఇచ్చాడు. అంటే మాసాలా కమర్షియల్ కంటెంట్ తోనే వెయ్యి కోట్ల రేంజ్ సక్సెస్ చూస్తున్నాడు షారుక్. మరి అలాంటి షారుక్ కు మంచి కంటెంట్ ఉన్న ఎమోషనల్ డ్రామా తగిలితే ఎలా ఉంటుంది ఊహించుకోండి.. అసలే ఎమోషనల్ డ్రామాలో షారుక్ నటన మాములుగా ఉండదు.

ఇప్పుడు షారుక్ నెక్స్ట్ నటించబోయే డంకీ సినిమాను ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హీరాని తెరకెక్కిస్తున్నారు. ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాజిక అంశాలే ఇతివృత్తం చేసుకొని మనసుకు హత్తుకునేలా చిత్రాలు తెరకెక్కించడంలో ఆయన స్పెషలిస్ట్. మున్నా భాయ్ ఎంబీబీఎస్, లగే రహూ మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే, సంజు చిత్రాలు చూస్తే ఈ విషయం పక్కాగా అర్థమవుతోంది. మరి ఇలాంటి దర్శకుడితో షారుక్ డంకీ సినిమా చేయబోతున్నారు.

అంటే ఈ చిత్రం కూడా దాదాపుగా మంచి మెసేజ్ అండ్ ఎమోషన్స్ తోనే ఉంటుంది. కాబట్టి షారుక్.. పఠాన్, జవాన్ లాంటి కమర్షియల్ చిత్రాలతోనే ఈ రేంజ్ భారీ సక్సెస్ అందుకుంటుందే.. నెక్ట్స్ రాబోయే సోషల్ మెసేజ్, ఎమోషన్స్ కాన్సెప్ట్ డంకీతో ఎలాంటి రేంజ్ సక్సెస్ అందుకుంటారా, బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ నెంబర్లను సాధిస్తారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో...

డంకీ సినిమాలో షారుక్ కు జోడీగా తాప్సీ పన్నూ నటించనుంది. క్రిస్మస్‌ కానుకగా 2023 డిసెంబరు 22న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని గతంలో మూవీటీమ్ అనౌన్స్ చేసింది. ఇందులో షారుక్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారు. జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, రాజ్‌కుమార్‌ హిరాణి ఫిల్మ్స్‌ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.