Begin typing your search above and press return to search.

స్కంద ట్రైలర్.. ఇలా ఇంకెన్నాళ్లు బోయపాటి?

ఇంకెన్నాళ్లు ఇవే రోత డైలాగ్స్ అంటూ ట్రైలర్ లో డైలాగ్స్ అన్ని కట్ చేసి వీడియోగా పోస్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   27 Aug 2023 4:20 AM GMT
స్కంద ట్రైలర్.. ఇలా ఇంకెన్నాళ్లు బోయపాటి?
X

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కి సినిమాలు అన్ని కూడా ఇంచుమించు ఒకే టెంప్లెట్ తో ఉంటాయనే మాట చాలా కాలం నుంచి వినిపిస్తుంది. రెండు కుటుంబాల మధ్య తరతరాలుగా నడుస్తున్న పగ. ఆ పగ కోసం ఒకరిని ఒకరు కసితీరా చంపుకోవడం. పోలీసులు బోయపాటి సినిమాలలో ప్రేక్షకపాత్రలకే పనిచేస్తారు. అయితే ఈ ఫార్మాట్ లో బోయపాటి చేస్తున్న సినిమాలు అన్ని ఒకదానిని మించి ఇంకోటి హిట్ అవుతున్నాయి.

అతని కెరియర్ లో డిజాస్టర్ అంటే వినయ విధేయ రామా. ఇది కాస్తా స్టోరీ లైన్ మారింది. కానీ రొటీన్ గా ఉండే పవర్ ఫుల్ డైలాగ్స్, అలాగే బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం కామన్ గా ఉంటాయి. చివరిగా అఖండతో బోయపాటి శ్రీను బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం రామ్ పోతినేనితో స్కంద మూవీ చేస్తున్నారు.

ఈ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ బట్టి సినిమాలో రామ్ పోతినేనిని పవర్ ఫుల్ మాస్ హీరోగా ఎలివేట్ చేసినట్లు కనిపిస్తోంది. మెజారిటీగా యాక్షన్ బ్లాక్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో ట్రైలర్ మొత్తం ఉంది. అలాగే గెడ్డంతో రఫ్ లుక్ లో రామ్ పోతినేని కనిపిస్తున్నాడు. బోయపాటి స్కంద మూవీ కూడా రెండు కుటుంబాల మధ్య పగ, ప్రతీకారం అనే ఎలిమెంట్ లతోనే ఆవిష్కరించినట్లు టైటిల్ బట్టి తెలుస్తోంది.

ఈ సినిమాలో డైలాగ్స్ పై తాజాగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఇంకెన్నాళ్లు ఇవే రోత డైలాగ్స్ అంటూ ట్రైలర్ లో డైలాగ్స్ అన్ని కట్ చేసి వీడియోగా పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అవుతోంది. ఎన్ని సార్లు ఇదే డైలాగ్స్ ని పెట్టిన ఆడియన్స్ చూస్తున్నారు కదా అని కొంతమంది కామెంట్స్ చేయగా, బోయపాటి సినిమాలు అంటే ఇంతకు మించి ఎక్స్ పెక్ట్ చేయకూడదు అని మరికొంత మంది పోస్టులు పెడుతున్నారు.

అయితే కంటెంట్ లో దమ్ముంటే ఇలాంటి డైలాగ్స్ ఎన్నిసార్లు పెట్టిన వర్క్ అవుట్ అవుతాయని సమర్ధించేవారు ఉన్నారు. బోయపాటి ఫార్మాట్ సినిమాలు ఇష్టపడే వారు ట్రైలర్, అందులో డైలాగ్స్ కి పాజిటివ్ గా రియాక్ట్ అవుతూ ఉంటే, కొత్తదనం కోరుకునేవారు మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.