Begin typing your search above and press return to search.

స్కంద కొత్త పోస్టర్స్​.. ఈ కెమిస్ట్రీ కేక

ఈ పోస్టర్​లో రామ్​ తెల్ల పంచెకట్టులో గోల్డ కలర్​ చీరలో శ్రీలీల చిలిపి సరసాలు, నవ్వూతూ ప్లజెంట్​గా కనిపించారు.

By:  Tupaki Desk   |   12 Aug 2023 12:42 PM GMT
స్కంద కొత్త పోస్టర్స్​.. ఈ కెమిస్ట్రీ కేక
X

ఉస్తాద్​ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రానున్న పాన్ ఇండియా హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ 'స్కంద'. రామ్ కెరీర్​లోనే హైయెస్ట్ బడ్జెట్​తో ఈ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. యంగ్ సెన్సేషనల్​ బ్యూటీ శ్రీలీల హీరోయిన్​గా నటిస్తోంది. వీరిద్దరికీ ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ. వారియర్ లాంటి డిజాస్టర్​ తర్వాత రానున్న ఈ చిత్రంపై రామ్​ చాలా హోప్స్ పెట్టుకున్నారు.



అయితే అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి నుంచి రాబోతున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 15న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్​, పోస్టర్స్​ ఆకట్టుకోగా.. సాంగ్​ మాత్రం కాస్త డీలా పరిచింది. కానీ అందులో శ్రీలీల-రామ్​ స్టెప్పులు బాగానే ఉన్నాయి. అయితే విడుదల తేదీ దగ్గర పడటం వల్ల ప్రమోషన్స్​లో మరింత జోరు పెంచే దిశగా ముందుకెళ్తోంది మూవీటీమ్​.

ఈ క్రమంలోనే ఆఫ్​లైన్​ ప్రమోషన్స్​లో భాగంగా తాజాగా మరో రెండు కొత్త పోస్టర్లను రిలీజ్ చేసింది మూవీటీమ్. రెండు పోస్టర్ల ద్వారా సినిమాలో ఎలాంటి కంటెంట్​ ఉండబోతుందో తెలిపింది. లవ్​ అండ్ యాక్షన్​ రెండు అదిరిపోయేలా ఉంటుందని చెప్పింది.

ఓ పిక్​లో రామ్​ పవర్​ఫుల్​ యాక్షన్ ప్యాక్డ్​గా కనిపించారు. గుబురు గడ్డం, సీరియస్​ లుక్​లో విలన్లను చితకొడుతూ పవర్​ఫుల్​గా చూపించారు రామ్​. మొత్తంగా మాసీవ్​గా ఉన్న ఈ పోస్టర్​ బ్యాక్​గ్రౌండ్​లో విలన్లు, మంటలతో ఆకట్టుకుంటోంది.

మరో పోస్టర్​లో రామ్​-శ్రీలీల మధ్య లవ్ అండ్ రొమాంటిక్ కెమిస్ట్రీ బాగా చూపించారు. ఫుల్ రొమాంటిక్​గా ఉన్న ఈ పోస్టర్​లో రామ్​ తెల్ల పంచెకట్టులో గోల్డ కలర్​ చీరలో శ్రీలీల చిలిపి సరసాలు, నవ్వూతూ ప్లజెంట్​గా కనిపించారు. ఇది ఫ్యామిలీ ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకునేలా ఉంది. మొత్తంగా ఈ రెండు పోస్టర్ల ద్వారా అటు మాస్​ ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్​ను మెప్పించేలా సినిమాను తెరకెక్కించినట్లు వివరించారు.

ఫైనల్​గా ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడిన ఈ సినిమా ఈ పోస్టర్స్​తో మరింత క్యూరియాసిటీని పెంచింది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్​ ఇటీవలే ఈ పాట చిత్రీకరణతో పూర్తి చేసుకుంది. తమన్​ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌ మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్​పై శ్రీనివాస చిట్టూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డీఓపీ సంతోష్​ డిటాకే అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్ చేస్తున్నారు.