Begin typing your search above and press return to search.

స్కంద హిట్ అయితే.. ఇది ప్లాన్!

ఒక వేళ హిట్ అయితే మాత్రం స్కంద 2కి కూడా ప్లానింగ్ చేయడానికి అదిరిపోయే లీడ్ కూడా బోయపాటి విడిచిపెట్టాడంట.

By:  Tupaki Desk   |   17 Sep 2023 5:01 AM GMT
స్కంద హిట్ అయితే.. ఇది ప్లాన్!
X

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం స్కంద. ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ రిలీజ్ కాబోతోంది. రామ్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ బిజినెస్ గట్టిగానే జరిగింది. కెరియర్ లోనే హైయెస్ట్ డీల్స్ స్కంద సినిమాకి సెట్ కావడం విశేషం.

శ్రీలీల ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో బోయపాటి స్టైల్ మాస్ కమర్షియల్ అంశాలతో స్కంద మూవీ ఉండబోతోందని టీజర్ తోనే కన్ఫర్మ్ అయ్యింది. అయితే బోయపాటి స్టైల్ యాక్షన్ చిత్రాలకి హిందీ డబ్బింగ్ వెర్షన్ లో మంచి మార్కెట్ ఉంది.

ఈ మధ్యకాలంలో ఇలాంటి మాస్ చిత్రాలు నార్త్ ఆడియన్స్ కి భాగా కనెక్ట్ అవుతున్నాయి. అలాగే మాస్ చిత్రాలని ఇష్టపడే ఆడియన్స్ తెలుగులో కూడా ఉన్నారు. కథ ఎలా ఉన్న పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఓ నాలుగు, ఐదు ఉంటే సినిమాని సూపర్ హిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మాస్ పల్స్ భాగా తెలిసిన బోయపాటి జోనర్ మార్చకుండా ఒకే ఫార్ముల కథలని మార్చి మార్చి తీసి సక్సెస్ అందుకుంటున్నాడు.

రామ్ పోతినేని స్కంద కోసం దానినే ఫాలో అయ్యాడు. ఇదిలా ఉంటే ఇన్ సైడ్ టాక్ ప్రకారం చివరి 30 నిమిషాల ఎపిసోడ్ స్కంద సినిమాలో నెక్స్ట్ లెవల్ లో ఉంటుందంట. గూస్ బాంబ్స్ తెచ్చే ఎలిమెంట్స్ కూడా పుష్కలంగానే మూవీలో ఉన్నాయంట. పాజిటివ్ రిపోర్ట్స్ ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్నాయి.

ఒక వేళ హిట్ అయితే మాత్రం స్కంద 2కి కూడా ప్లానింగ్ చేయడానికి అదిరిపోయే లీడ్ కూడా బోయపాటి విడిచిపెట్టాడంట. రామ్ పోతినేని ది వారియర్ సినిమాతో యాక్షన్ హీరోగా తనని తాను ఎలివేట్ చేసుకోవాలని ట్రై చేసాడు. అది వర్క్ అవుట్ కాలేదు. మరి బోయపాటి అయిన రామ్ పోతినేనికి స్కందతో మాస్ కమర్షియల్ హిట్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.